వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సకాలంలో మేల్కున్నారు. కాపునేత వంగవీటి రంగాపై వైసీపీ నేత గౌతమ్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వెంటనే సస్పెండ్ చేసి డ్యామేజ్ కంట్రోలుకు చర్యలు తీసుకున్నారు. తెరపై ఇవన్నీ జరుగుతుండగానే తెరవెనుక కాపులు, రంగా అభిమానులను వైసీపీకి వ్యతిరేకంగా దువ్వటం మొదలైంది. కాపులను, రంగా అభిమానులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు అందులోనూ వైసీపీకి వ్యతిరేకంగా దువ్వటమే లక్ష్యంతో ఈనెల 6వ తేదీన విజయవాడలోనే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసారు.  

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సకాలంలో మేల్కున్నారు. కాపునేత వంగవీటి రంగాపై వైసీపీ నేత గౌతమ్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వెంటనే సస్పెండ్ చేసి డ్యామేజ్ కంట్రోలుకు చర్యలు తీసుకున్నారు. ఎప్పుడైతే గౌతమ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారో రాష్ట్రంలోని కాపునేతల్లో ప్రత్యేకించి రంగా అభిమానుల్లో ఒక్కసారిగా ఆదివారం అలజడి మొదలైంది. దాంతో విజయవాడలోని రంగా అభిమానులు ప్రధానంగా రంగా భార్య వంగవీటి రత్నకుమారి, కొడుకు వంగవీటి రాధాకృష్ణలు రెచ్చిపోయారు. దాంతో సాయంత్రం నుండి విజయవాడలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

సాయంత్రం రత్నకుమారి, రాధాకృష్ణ తమ మద్దతుదారులతో ఒక్కసారిగా గౌతమ్ రెడ్డి ఇంటిపైకి దాడికి ప్రయత్నించారు. జరుగుతన్న పరిణామాలతో గౌతమ్ కుడా ముందు జాగ్రత్తగా మద్దతుదారులతో సిద్ధంగానే ఉన్నట్లున్నారు. ఒకవైపు తల్లి, కొడుకు, అభిమానులు, మరోవైపు గౌతమ్ మద్దతుదారులతో విజయవాడలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్ధితులు మొదలయ్యాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవటంతో పరిస్ధితి అదుపులోకి వచ్చింది.

సరే, తెరపై ఇవన్నీ జరుగుతుండగానే తెరవెనుక కాపులు, రంగా అభిమానులను వైసీపీకి వ్యతిరేకంగా దువ్వటం మొదలైంది. కాపులను, రంగా అభిమానులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు అందులోనూ వైసీపీకి వ్యతిరేకంగా దువ్వటమే లక్ష్యంతో ఈనెల 6వ తేదీన విజయవాడలోనే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. దానికి వంగవీటి శంతన్ కుమార్ సారధ్యం వహిస్తున్నారు. రంగా మిత్రమండలి తదితర సంఘాలను శంతనే పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ఆయన ఆధ్వర్యంలోనే 6వ తేదీ సమావేశం జరుగుతున్నట్లు సమాచారం.

ఎప్పుడైతే పరిణామాలు వేగంగా మొదలయ్యాయో వైసీపీ వెంటనే మేల్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా రాజధాని ప్రాంతంలోని కాపులందరినీ వైసీపీకి వ్యతిరేకంగా దువ్వుతున్నారన్న సమాచారం తెలియగానే గౌతమ్ ను జగన్ సస్పెండ్ చేసారు. ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ కోస్తా ప్రాంతంలో కాపుల ప్రాబల్యం గురించి జగన్ కు కొత్తగా చెప్పేదేమీలేదు.

అందులోనూ వంగవీటి రంగా విషయంలో అయితే, ఇక చెప్పనే అక్కర్లేదు. ఈ విషయాలన్నింటినీ గుర్తుంచుకునే జగన్ వెంటనే మేల్కొని గౌతమ్ ను వెంటనే సస్పెండ్ చేసారు. దాంతో కాపుల్లో, రంగా అభిమానుల్లో వైసీపీపై మొదలైన వ్యతిరేకత కొంత తగ్గినట్లే కనబడుతోంది. దానికితోడు వైసీపీ ముఖ్యులు కుడా వంగవీటి కుటుంబసభ్యులతో తెరవెనుక మంతనాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే 6వ తేదీ సమావేశం జరుగుతుందా? జరిగితే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందన్న విషయాలపై సర్వత్రా ఆసక్తి మొదలైంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి