Asianet News TeluguAsianet News Telugu

గాలి జనార్థన్ రెడ్డికి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఏపీ పరిధిలో మళ్లీ తవ్వకాలకు అభ్యంతరం లేదన్నప్రభుత్వం...

ఓబీసీ ఆంధ్రప్రదేశ్ పరిధిలో మళ్లీ తవ్వకాలు చేపట్టడానికి తమకేం అభ్యంతరం లేదని జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో తెలిపింది. దీనిమీద నేడు సుప్రీంలో విచారణ జరగనుంది.

Jagan sarkar green signal to Gali Janardhan Reddy Obulapuram Mining Company
Author
Hyderabad, First Published Aug 10, 2022, 8:04 AM IST

అమరావతి : వివాదాస్పద మైనింగ్ వ్యాపారి, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పరిధిలోని గనుల్లో మళ్లీ తవ్వకాలు ప్రారంభించేందుకు మార్గం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.  తవ్వకాలు ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలంటూ ఆయనకు చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించింది. కర్ణాటకతో సరిహద్దు అంశంపై స్పష్టత వచ్చినందున.. తమ భూభాగంలో తవ్వకాలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని  ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఓఎంసీ విజ్ఞప్తిని పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. 

ఆ కంపెనీపై దాఖలైన మరో కేసును విచారిస్తున్న ధర్మాసనానికి ఈ కేసును కూడా నివేదించాలని సూచించింది. దీనిపై బుధవారం విచారణ జరగనుంది. గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసి పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. వీటిపై సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. 2009లో ఆ కంపెనీతవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై ఓఎంసీ అప్పటి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పు ఆ కంపెనీకి అనుకూలంగా వచ్చింది. దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఒకపక్క ఓఎంసి కేసు విచారణ పెండింగ్లో ఉండగానే.. తన భూభాగం పరిధిలో తవ్వకాలకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం గమనార్హం.

ట్విట్టర్ ఖాతా హ్యాక్.. కేశినేని నాని అలర్ట్, ఫేక్ పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు

సంతకం చేయకుండానే…
గన్నుల్లో మళ్లీ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని ఓఎంసి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు జూలై 21న విచారణ జరిపింది. ఆ సందర్భంగా ఏపీ, కర్ణాటక మధ్య సరిహద్దులు నిర్ణయించే ప్రక్రియ పూర్తయిందని, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించారని కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  తరపు న్యాయవాదులు తెలియజేశారు. మ్యాప్ మీద  ఏపీ ప్రభుత్వం తరఫున ఇప్పటికే సంతకం కూడా చేశారని, కర్ణాటక ప్రభుత్వం ఇంకా చేయాల్సి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యింది కాబట్టి మళ్లీ అనుమతి ఇవ్వాలని  ఓఎంసీ తరఫు న్యాయవాది ముకుల్  రోహిత్గీ సుప్రీం కోర్టుకు తెలిపారు.

దీని మీద ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పందించారు. కేటాయించిన పరిధిలో తవ్వకాలు జరిపేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సరిహద్దుల్ని నిర్ణయిస్తూ రూపొందించిన మ్యాప్ పై ఇంకా కర్ణాటక ప్రభుత్వం తరఫున సంతకాలు చేయకుండానే,  మైనింగ్కు తమకు అభ్యంతరం లేదని రాష్ట్రప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇది పరిణామ క్రమం…
- ఓఎంసీపై ఫిర్యాదులు రావడంతో 2009లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, ప్లీజ్ ప్రాంతాల సరిహద్దులు నిర్ణయించే వరకు తవ్వకాలు నిలిపివేసింది.
- ఓఎంసీ అతిక్రమణ లకు పాల్పడిందన్న ఆరోపణలన్నీ ఏపీ ప్రభుత్వం ఖండించింది. దీంతో అటవీ శాఖ తన ఉత్తర్వులు అమలు నిలిపివేసింది.
- 2009 నీలో స్థానిక మైనింగ్ వ్యాపారి ఒకరు ఓఎంసీ అక్రమాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
- లీజ్ లను సస్పెండ్ చేయాలని, సరిహద్దులు గుర్తించారని,  దీని అయ్యే ఖర్చు రికవరీ చేయాలని 2009, నవంబర్ లో సీఈసీ సిఫార్సు చేసింది.  తర్వాత రాష్ట్ర కమిటీ సైతం పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేసింది.

- 2009 డిసెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. మరోవైపు  ఓఎంసి హైకోర్టును ఆశ్రయించగా,  మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేస్తూ  ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

- దీంతో 2010   ఫిబ్రవరిలో మైనింగ్ నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది.
- 2011 13 లో కర్ణాటకలోని బళ్ళారి పరిధిలో కూడా  మైనింగ్ నిలిపివేయాలని  ఆదేశించింది. కర్ణాటక మైనింగ్ లీజుల పై కూడా సీఈసీ పలు నివేదికలు అందజేసింది.
- ఏపీ, కర్ణాటకల సరిహద్దులను నిర్ణయించేందుకు 12 వారాల గడువు నిర్వహిస్తూ సుప్రీంకోర్టు 2017 డిసెంబర్ లో ఆదేశాలు జారీ చేసింది.
- సరిహద్దుల  గుర్తింపు పూర్తి చేయకపోవడంపై 2018 లో రెండు రాష్ట్రాలను సుప్రీం కోర్టు  మందలించింది.

Follow Us:
Download App:
  • android
  • ios