Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ ఖాతా హ్యాక్.. కేశినేని నాని అలర్ట్, ఫేక్ పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు

టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. ఆయన పేరుతో ట్విట్టర్‌లో కొందరు ఫేక్ పోస్టులు పెడుతున్నారు. దీనిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు కేశినేని అనుచరులు. కేశినేని నాని పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ట్విట్లు .. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించినవి కావడంతో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది

 tdp mp kesineni nani twitter account hacked
Author
First Published Aug 9, 2022, 4:53 PM IST

టీడీపీ (tdp) ఎంపీ కేశినేని నాని (kesineni nani) ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. ఆయన పేరుతో ట్విట్టర్‌లో కొందరు ఫేక్ పోస్టులు పెడుతున్నారు. దీనిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు కేశినేని అనుచరులు. ఈ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. 

కాగా.. కేశినేని నాని పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ట్విట్లు .. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించినవి కావడంతో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా కాలం తర్వాత ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాత కేశినేని నాని అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేసినట్లుగా ట్వీట్లు వెలువడ్డాయి. ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ కావడంతో విషయం కేశినేని నాని వరకు వెళ్లింది. దీంతో అవి తాను పోస్ట్ చేయలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫేక్ పోస్టులపై కేశినేని నాని అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also REad:చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో ముభావంగా కేశినేని నాని.. అందరి ముందే షాకింగ్ రియాక్షన్.. పుష్పగుచ్చం ఇవ్వాలని కోరగా..

అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ముభావంగా కనిపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ చేరుకోగానే.. ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. చంద్రబాబుకు ఎంపీలు సన్మానం చేసి, పుష్పగుచ్చం ఇచ్చారు. అయితే చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా మరో ఎంపీ గల్లా జయదేవ్.. కేశినేని నానిని కోరారు. అయితే నాని మాత్రమే మీరే ఇవ్వండనేలా.. పుష్పగుచ్చాని విసురుగా తోసేశారు. అక్కడున్న వారంతా కొద్దిగా షాక్ అయ్యారు. 

ఆ తర్వాత కూడా కేశినేని నాని చంద్రబాబుకు దూరం దూరంగానే ఉన్నట్టుగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఘటన టీడీపీలోనే కాకుండా.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొంతకాలంగా చంద్రబాబు తీరుపై కేశినేని నాని అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తన సోదురుడు కేశినేని శివనాథ్‌ను (చిన్ని) చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడనే అసంతృప్తిలో కేశినాని నాని ఉన్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. 

విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కూతురును శ్వేతను టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించేలా చేయడంలో కేశినేని నాని విజయం సాధించారు.  అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవిచూసింది. అయితే పార్టీకి నష్టం జరగడానికి టీడీపీ నేతలు బోండా ఉమ, నాగుల్‌మీరా కారణమని కేశినేని నాని ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన ఆయన చర్యలు తీసుకోలేదని గుర్రుగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి కేశినేని నాని బహిరంగంగా ఎలాంటి కామెంట్స్ చేయకపోయినప్పటికీ.. మీడియా చిట్ చాట్‌లతో పాటు, తన సన్నిహితుల వద్ద కీలక కామెంట్స్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు తన సోదరుడు చిన్నిని ప్రోత్సహిస్తున్నారని భావిస్తున్న కేశినేని నాని అసంతృప్తి‌తో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios