వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర చివరి రోజు ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా పెద్ద కొజ్జిరియా నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు.

ఈ రోజుతో ప్రజా సంకల్పయాత్ర ముగియనుండటంతో జగన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయన బస చేసిన శిబిరం వద్దకు వచ్చారు. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం వేలాదిమంది కార్యకర్తల మధ్య జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు.