ఏపీ మంత్రివర్గ ఏర్పాటుపై సీఎం జగన్ కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రుల జాబితాను ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులు దక్కనున్న వారందరికీ జగన్ స్వయంగా ఫోన్ చేసి విషయం వివరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా గురువారం కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు కి.. సీఎం జగన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

మంత్రి వర్గంలో కోరుముట్ల శ్రీనివాసులుకి చోటు కల్పిస్తున్నట్లు జగన్ ఆయనకు చెప్పారు. దీంతో కొరముట్ల హుటాహుటిన తన అనుచరగణంతో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. మరోవైపు తమ అభిమాన నేతకు మంత్రి పదవి దక్కడంతో కొరముట్ల అనుచరులు, వైసీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటున్నారు.
 
కాగా.. కొరముట్ల శ్రీనివాసులు రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి నర్సింహాప్రసాద్‌పై శ్రీనివాసులు భారీ మెజార్టీతో గెలుపొందారు.