కడప:ముఖ్యమంత్రి హోదాలో తన స్వంత జిల్లా కడపలో జిల్లా  జమ్మలమడుగులో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో  సీఎం వైఎస్ జగన్ సంతోషంగా ఉన్నారు.

ఈ సభ ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగాన్ని సీఎం జగన్  అభినందించారు. వారం రోజులుగా అధికారులు ఈ సభను విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

ఈ సభను విజయవంతం చేసేందుకుగాను  జిల్లా కలెక్టర్ సిహెచ్ హరికిరణ్ పలు టీమ్‌లను ఏర్పాటు చేశాడు. ఈ టీమ్‌లు సమన్వయంతో  తమకు కేటాయించిన పనులను పూర్తి చేశాయి.

వ్యవసాయ శాఖకు చెందిన అధికారులు ఈ సభ విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించారు.  గత వారంలో  మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పలు దఫాలు సమావేశమయ్యారు.  వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌పై సీఎం  అభినిందించారు.