రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్దిగా పోటీ చేస్తున్న కోవింద్ ప్రచారంలో భాగంగా వైసీపీ మద్దతు కోరుతూ జగన్ తో భేటీ అయ్యారు. కోవింద్ వెంట కేంద్రమంత్రి వెంకయ్యనాయడు తదితరులున్నారు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి రామ్నాద్ కోవింద్ తో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఓ హోటల్లో కోవింద్ ను జగన్ తో పాటు వైసీపీ ఎంఎల్ఏ, ఎంపిలు మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్దిగా పోటీ చేస్తున్న కోవింద్ ప్రచారంలో భాగంగా వైసీపీ మద్దతు కోరుతూ జగన్ తో భేటీ అయ్యారు. కోవింద్ వెంట కేంద్రమంత్రి వెంకయ్యనాయడు తదితరులున్నారు. కాగా కోవింద్ కు జగన్ గతంలోనే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా?ఇక్కడి నుండి కోవింద్ విజయవాడకు వెళతారు. అధికార పార్టీలైన టిఆర్ఎస్, టిడిపిలను కాదని ఏపిలో ప్రతిపక్షమైన వైసీపీనే కోవింద్ ముందుగా ఎందుకు కలిసినట్లో?