Asianet News TeluguAsianet News Telugu

జగన్ లాయరే ‘ఆచార్య’ సినిమా నిర్మాత... అందుకే ఆ భేటీ.. రఘురామ

సినీ పరిశ్రమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజకీయనాయకులకే ఒళ్ళు బలిసిందని ప్రజలు అనుకుంటున్నారని,  ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పరిశ్రమ పై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. 17 ఏళ్లుగా తాను వైకుంఠ ఏకాదశికి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాడినని.. కానీ కొంతమంది స్వార్థ రాజకీయాల వల్ల అటు వైకుంఠ ఏకాదశి, ఇటు సంక్రాంతి జరుపుకో లేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు

Jagan Lawyer is the producer of 'Acharya' says rebel mp Raghurama Krishnaraju
Author
Hyderabad, First Published Jan 14, 2022, 7:55 AM IST

ఢిల్లీ : ప్రతి కేసులో YS Jagan కు అనునిత్యం చేదోడు వాదోడుగా ఉండే 
Niranjan Reddy ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న Acharya Cinema కు నిర్మాత అని ఎంపీ Raghurama Krishnaraja అన్నారు. అందువల్లే సినిమా పరిశ్రమకు న్యాయం చేయించేందుకు Chiranjeeviని ముఖ్య మంత్రితో సమావేశపరిచారని తెలిపారు. ఆ సమావేశం తరువాతయినా సినీ పరిశ్రమపై దాడి ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు ఆయన గురువారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.  

సినీ పరిశ్రమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజకీయనాయకులకే ఒళ్ళు బలిసిందని ప్రజలు అనుకుంటున్నారని,  ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పరిశ్రమ పై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. 17 ఏళ్లుగా తాను వైకుంఠ ఏకాదశికి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాడినని.. కానీ కొంతమంది స్వార్థ రాజకీయాల వల్ల అటు వైకుంఠ ఏకాదశి, ఇటు సంక్రాంతి జరుపుకో లేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి విమానాశ్రయంలోకి వైసీపీ కార్యకర్తలను రానివ్వనందుకు నీటి సరఫరా నిలిపివేయడం రాష్ట్రంలోని పరిస్థితులకు అద్దం పడుతోందన్నారు.

రావణ సంహారానికిముందు రాముడు, కురువంశ నిర్మూలనకు ముందు పాండవులు పద్నాలుగేళ్ళు వనవాసం చేశారని,,, తనకు అన్నేళ్లు అక్కర్లేదన్నారు. మే 14లోపు తప్పకుండా రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి అంకురార్పణ జరుగుతుందన్నారు.  తన రాజీనామా తర్వాత జరిగే ఎన్నిక ఇందుకు నాంది పలుకుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

కాగా,   గురువారం ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించి వైసిపి ప్రభుత్వంపై మరొకసారి విరుచుకుపడ్డారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.  రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఎద్దేవా చేశారు.  ఉద్యోగులు, భయపడుతున్న వైసీపీ నేతలను మార్చుకోవాలని  జగన్కు రఘురామ సూచించారు,  న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడే వారిని తెచ్చుకోవాలని ఆయన కోరారు.

క్షవరం అయిందని ఓటర్లకు రెండేళ్ల తర్వాత తెలిసిందని.. ఉద్యోగులకు సీఎం జగన్ శఠగోపం పెట్టారని raghu rama విమర్శించారు.  క్షవరం అయితే కానీ వివరం రాదనేలా..  ఉద్యోగ సంఘాల పరిస్థితి ఉందని.. అందరూ దివాలా తీసి కొంపలు అమ్ముకోవాలి అన్నట్లుగా ఉంది అంటూ సెటైర్లు వేశారు.

నా పుట్టలో వేలు పెడితే కుట్టనా.. అనేలా పరిస్థితులు ఉన్నాయని రఘురామ అన్నారు. ప్రస్తుతమున్న పిఆర్సి కొనసాగితే చాలు అనేలా ఉద్యోగులు భావిస్తున్నారని వైసీపీ రెబల్ ఎంపీ వ్యాఖ్యానించారు. తనను స్పూర్తిగా తీసుకుని ప్రజలు సోరాడాలని.. నియోజకవర్గ ప్రజలు తనను మళ్లీ గెలిపించాలని రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఈ నెల 17న తనను విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని  రఘురామకృష్ణంరాజు నిన్న చెప్పారు. బుధవారం ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు తీసుకొన్న తర్వాత Raghu Rama krishnam Raju బుధవారం నాడు Hyderabad గచ్చిబౌలిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.రెండున్నర ఏళ్ల తర్వాత తాను తన స్వంత నియోజకవర్గానికి వెళ్లే సమయంలో విచారణకు రావాలని Cid అధికారులు కోరుతున్నారన్నారు. ఇవాళ నోటీసులు ఇచ్చి రేపే విచారణకు రావాలంటే ఎలా అని తాను సీఐడీ అధికారులను ప్రశ్నించానన్నారు. దీంతో ఈ నెల 17న విచారణకు రావాలని సీఐడీ అధికారులు తనకు చెప్పారన్నారు. గతంలో తనపై నమోదైన కేసుల్లో మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణకు రావాలని సీఐడీ అధికారులు కోరారని రఘురామకృష్ణంరాజు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios