Asianet News TeluguAsianet News Telugu

జగన్ తొలి అడుగు...చెప్పులతోనే

  • ప్రజాసంకల్పయాత్రకు సోమవారం ఉదయం శ్రీకారం చుట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి అడుగులు చెప్పులతోనే మొదలుపెట్టారు.
jagan launches prajasamkalpayatra with cheppals

ప్రజాసంకల్పయాత్రకు సోమవారం ఉదయం శ్రీకారం చుట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి అడుగులు చెప్పులతోనే మొదలుపెట్టారు. మామూలుగా పాదయాత్ర చేద్దామనుకున్న వారు ఎవరు కూడా చెప్పులతో నడవరు. ఎందుకంటే. ఎక్కువ దూరాన్ని నడవాలంటే చెప్పులతో సౌకర్యంగా ఉండదు. అంతెందుకు, మొట్టమొదట పాదయాత్ర చేసిన వైఎస్ కానీ తర్వాత చేసిన చంద్రబాబునాయుడు కానీ ఎవ్వరూ చెప్పులతో నడవలేదు. ఎవరు నడిచినా బూట్లతోనే నడిచారు. బూట్లలో ఉన్న సౌకర్యం చెప్పుల్లో ఉండదు.

jagan launches prajasamkalpayatra with cheppals

చెప్పులతో నడిచేటప్పుడు ఏమవుతుందంటే కొంతసేపు నడవగానే పాదాల వద్ద చెమటలు పడుతుంది. దాంతో పాదాలకు, చెప్పులకు మధ్య తడి చేరి చెప్పులు జారి పోతుంటుంది. అదే బూట్లనుకోండి చెమట పట్టదు, తడి చేరదు. ఎందుకంటే, బూట్లు వేసుకునే ముందే సాక్సులు వేసుకుంటారు కాబట్టి పట్టే చెమటను సాక్సులు పీల్చేసుకుంటాయి. దాంతో పాదాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పైగా పాదం చుట్టూ బూట్లు పట్టినట్లుంటాయి కాబట్టి పాదాలకు గ్రిప్ కూడా ఉంటుంది. ఏదేమైనా బూట్లలో ఉండే సౌకర్యం, చెప్పుల్లో ఉండదన్నది వాస్తవం. పైగా బూట్లు వేసుకుంటే నడకలో వేగం కూడా పెరుగుతుంది.

jagan launches prajasamkalpayatra with cheppals

మరి, జగన్ కు ఈ విషయాలు తెలియవనుకునేందుకు లేదు. ఎందుకంటే, కాలేజీ రోజుల్లో జగన్ క్రీడాకారుడే. కాబట్టి చెప్పులు వేసుకుని నడవటానికి, బూట్లతో నడవటానికి తేడా కచ్చితంగా తెలిసే ఉంటుంది. అయినా చెప్పులతోనే నడక మొదలుపెట్టారంటే బహుశా మొదటి రోజు కాబట్టే చెప్పులతో నడుద్దామనుకున్నారేమో. రాత్రికి పాదయాత్ర ముగిసి రేపటి రోజున మొదలైనపుడు చూడాలి బూట్లు వేసుకుంటారో లేదో.

Follow Us:
Download App:
  • android
  • ios