వారానికోసారి కోర్టుకెళ్లే వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కి వెళ్లి పాద‌యాత్ర చేస్తాను అంటే న‌వ్వుతార‌ని మంత్రి ఆనంద‌బాబు ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ కి ముఖ్య‌మంత్రి సీటు పై ఆశ త‌ప్ప ప్ర‌జ‌ల‌పై మ‌మ‌కారం లేద‌న్నారు. రాష్ట్ర‌ ప్ర‌జ‌ల అభివృద్ది కొరుకునే వాడైతే ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాల‌ను అడ్డ‌కోవ‌డం ఎంట‌ని ఆనంద బాబు ప్ర‌శ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న జ‌గ‌న్ పై ధ్వ‌జ‌మెత్తారు.

ఏపీకి పట్టిన అతిపెద్ద శని జ‌గ‌న్‌ అని మంత్రి విమర్శించారు. నంద్యాల, కాకినాడ ఫలితాలతో జగన్‌లో మార్పురాలేదని, జ‌గ‌న్ వైఖరి కార‌ణంగా వైసీపీ నేతలు సేఫ్‌ జోన్‌ చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లోటస్‌పాండ్‌కు త్వరలో టులెట్‌ బోర్డు పెట్టడం ఖాయమని ఆనందబాబు జోస్యం చెప్పారు. అప్ప‌టికి కూడా జ‌గ‌న్ మార‌డ‌ని ఆయ‌న విమర్శించారు.

 

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి