జ‌గ‌న్ కు అధికారం వ‌స్తే ఎంత మందిని కాల్చుతారో...!

jagan had critical state now
Highlights

  • జగన్ ఫైర్ అయినా మంత్రులు
  • జగన్ కు అధికారం ఇస్తే మరీ అహాంకారంగా తయారవుతారన్నా ప్రతిపాటి పుల్లారావు.
  • జగన్ కు కనీస ప్రశ్చాతాపం లేదన్నా దేవినేని. 

వైసీపి అధ్య‌క్షుడు జ‌గ‌న్ కు అధికారం వ‌స్తే మ‌రింత మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తార‌ని టీడీపీ మంత్రులు పైర్ అయ్యారు. చంద్ర‌బాబు పై జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌పై దెవినేని ఉమా, ప‌త్తిపాటి ధ్వ‌జ‌మెత్తారు. మీడియాతో మాట్లాడినా మంత్రులు జ‌గ‌న్ పై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు.

 జ‌గ‌న్‌ చేసిన వ్యాఖ్యలపై కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం ఆయ‌న‌ అహంభావానికి నిదర్శనమని ఏపీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. జగన్ కండకావరంతో వ్యవహరిస్తున్నారని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. వైసీపికి ప్ర‌జ‌లంటే గౌవ‌రం లేద‌ని, త‌న‌ చేసిన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారే తప్ప... జగన్ ప్రవర్తనలో ఎక్కడా మార్పులేదని ఆయ‌న‌ అన్నారు. జ‌గ‌న్‌ ఈసీకి ఇచ్చిన‌ వివరణలో ఎక్కడ పశ్చాత్తాపం పడినట్లు లేదని ఉమా మండిపడ్డారు. జ‌గ‌న్ మాట‌ల‌ను ఈసీ పూర్తిగా వినాల‌ని, అనంత‌రం జగన్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
 
అనంత‌రం మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు జ‌గ‌న్ పై ధ్వ‌జ‌మెత్తారు. జగన్ లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మ‌రింత దుర్మార్గంగా మారుతార‌ని ఆయ‌న‌ అన్నారు. ఆయ‌న చేసిన త‌ప్పుడు వ్యాఖ్య‌ల‌కు క‌నీసం క్ష‌మాప‌ణం చెప్ప‌లేద‌ని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ త‌న నైజంలో ఏ మాత్రం మార్పు రాలేదని విమ‌ర్శించారు. ఇటువంటి నాయకుడికి అధికారం ఇస్తే రోజుకు ఎంతమందిని కాలుస్తారోనని ప్రజలు ఆలోచనలో పడ్డారని మంత్రి అన్నారు. జ‌గ‌న్ త‌మపై దుష్ప‌చారం మాని త‌మ పార్టీ బ‌లోపెతానికి కృషి చేయ్యాల‌ని ఆయ‌న సూచించారు.

loader