Asianet News TeluguAsianet News Telugu

పదో తరగతి సిలబస్ నుంచి ‘అమరావతి’ తొలగింపు..!

ఏపీలో పదోతరగతి సిలబస్ నుంచి అమరావతి పాఠాన్ని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే ఆ పాఠాలు చదివిన విద్యార్థులు వాటిని మినహాయించి పరీక్షలకు సిద్ధం కావాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది. 

Jagan Govt Excludes Amaravati Chapter From Tenth Class Text Books In AndhraPradesh
Author
Hyderabad, First Published Apr 4, 2022, 7:49 AM IST | Last Updated Apr 4, 2022, 7:49 AM IST

అమరావతి : శాతవాహన రాజులు.. వారి కంటే ముందు పాలకులు Amaravatiని కేంద్రంగా చేసుకుని ఏ విధంగా పరిపాలన సాగించారు?  ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని capitalగా ఎందుకు ఎంపిక చేసింది? ఇలా అనేక అంశాలను వివరిస్తూ పదవ తరగతి తెలుగు పుస్తకంలో రెండవ పాఠంగా అమరావతిని గత ప్రభుత్వ హయాంలో ముద్రించారు.  ప్రస్తుత ప్రభుత్వం Three capitals తెరపైకి తీసుకు వచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు అమరావతి పాఠాన్ని ఈ ఏడాది సిలబస్ నుంచి తొలగించారు. ఈ విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున విద్యార్థులపై భారం పడకుండా  ఉండాలని వివిధ సబ్జెక్టుల్లో కొన్ని పాఠాలను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు.  

అదేశాలందేనాటికే... 
అయితే, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందేనాటికే పాఠశాలలో అమరావతి పాఠాన్ని ఉపాధ్యాయులు బోధించారు. సిలబస్ భారం తగ్గించాలంటే పుస్తకం చివర్లోని పాఠాలను తొలగించే వీలుండగా  కావాలనే అమరావతి పాఠాన్ని తీసివేశారు అని పలువురు అంటున్నారు.  ఈ నెల 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్  పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో  అమరావతి,  వెన్నెల పాఠాలు మినహాయించి మిగిలినవి చదువుకొని పరీక్షలకు సిద్ధం కావాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీనిపై తుని ఎంఈవో  గీతాదేవి నీ వివరణ కోరగా  కోవిడ్ కారణంగా పాఠశాల పనిదినాలు తగ్గినందువల్ల ఏ పాఠ్యాంశాలు బోధించాలి?  వేటిని మినహాయించాలి అనే అంశంపై ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని... అవే ఉపాధ్యాయులు చెబుతున్నారని తెలిపారు. 

ఇదిలా ఉండగా, నిరుడు ఏప్రిల్ లో  ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థుల గురించి జగన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది నుండి సీబీఎస్ఈ సిలబస్ ను కూడా రాష్ట్రంలో తీసుకువస్తామని చెప్పారు. జగనన్న వసతి దీవెన పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ మేరకు ప్రకటించారు. 2021, ఏప్రిల్ 28న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగనన్న వసతి దీవెన ద్వారా దాదాపు రూ.2.270 కోట్ల సహాయం చేస్తామన్నారు. విద్యార్థుల చదువులకు పేదరికం రాకూడదని తెలిపారు. ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి అని ఆయన తెలిపారు.

అంతేకాదు ప్రతి ఏటా 2 వాయిదాల్లో జగనన్న వసతి దీవెన కార్యక్రమం కింద నగదు జమ చేస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. విద్యా రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు.  చదువుకు పేదరికం అడ్డుకాదని. పాలిటెక్నిక్, iti, డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులకు సహాయం చేస్తానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించామని  అన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపు రేఖల్ని మారుస్తున్నామని  ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అందరికీ ఈ పథకం వర్తింప చేస్తామని ఆయన తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios