ఆంధ్రప్రదేశ్‌లో సిటీ బస్సులకు వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతగా విశాఖ, విజయవాడలో ఆర్టీసీ సిటీ బస్సులు నడపనుంది. శనివారం నుంచి ఈ రెండు నగరాల్లో సిటీ బస్సులు రోడ్డెక్కుతాయి.

కేంద్రం ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులు నడపనుంది ఏపీఎస్ఆర్టీసీ. కాగా లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి దేశంలో సిటీ బస్సులు రోడ్డెక్కడం ఇదే మొదటిసారి.