Asianet News TeluguAsianet News Telugu

జగన్ కాలుమోప జాగా లేని అమరావతి

అమరావతి జగన్ దూర లేని కారడవి అయిపోయింది. అక్కడ అఫీసు కట్టుకోవడానికి జాగా దొరకరడం లేదు. అభద్రత కూడా వెంటాడుతూ ఉంది.

Jagan finds no space to set up Office in Amaravati

మొత్తానికి రాజధాని అమరావతి  ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం అనుకూలంగా లేని ప్రదేశంగా తయారయింది. రాష్ట్రం కాని రాష్ట్రం కర్నాటకలో బ్రహ్మాండమయిన ఇల్లు సులభంగా కట్టుకుని వుండవచ్చు.  హైదరాబాద్ లో లోటస్ పాండ్ ని అంతకంటే సలభంగా ఎంపిక చేసుకోని ఉండవచ్చు. అయితే, వరల్డ్ క్లాస్ అమరావతిలో ఆ పప్పు లుడకడం లేదు.

 

వెలగపూడికి ఆరేడు కిలో మీటర్ల వ్యాసార్థంలో జగన్ కాలుమోపేందుకు వీలులేకుండా ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడి  ప్లాన్ కట్టుదిట్టంగా తయారయింది.   కోర్ క్యాపిటల్ కు దరిదాపుల్లో ఎక్కడా ప్రతిపక్ష నాయకుడు గుడారం వేసే పరిస్థితి  లేదు. అందుకే  దాదాపు 15 కిమీ దూరంలో,ఎక్కడో విసిరేసినట్టుగా మంగళగిరిలో కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. అక్కడ కూడా  వైఎస్ఆర్ సి కార్యాలయానికి భూమి లీజుకు దొరకడం లేదు. ఫలితంగా సాక్షి భూమిలో స్థిరపడే పరిస్థితి వస్తున్నదని పార్టీ వర్గాలు ’ ఏషియా నెట్’ కు చెప్పాయి.

 

వెలగపూడికి, అంటే అసెంబ్లీకి, సెక్రటేరియట్ కు అయిదారు కిలో మీటర్లు దూరంలో పార్టీ కార్యాలయం ఉంటే బాగుంటుందని జగన్ భావించారట.  ఎందుకంటే, ఎమర్జీన్సీలో అసెంబ్లీకి వెళ్లడం, లేదా పనుల మీద చకాచకా సెక్రటేకరియట్ కు వెళ్లడం సుళువవుతంది. హైదరాబాద్ లో  గాంధీ భవన్, ఎన్టీ ఆర్ ట్రస్టు భవన్ ,సిపిఐ, సిపిఎం కార్యాలయాలు ఆరేడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి.  టిఆర్ ఆఫీస్ కూడా ఇంతే దూరంలో ఉంటుంది.  ఈ ఉద్దేశంతోనే   కోర్ క్యాపిటల్ కు అయిదారు కిలోమీటర్ల దూరంలో పార్టీ కార్యాలయానికి జాగా వెదకాలనుకున్నారు. ఈ కోర్ క్యాపిటల్ వచ్చేది చచ్చేది లేదనుకుని  స్థల సేకరణ జాప్యం చేశారు. వెలగపూడి తాత్కాలి-శాశ్వత రాజధాని అయి కూర్చోవడం అక్కడే అసెంబ్లీ కూడా రావడంతో ఇపుడు  అర్జంటుగా పార్టీ ఆఫీస్ ను ఏర్పాటుచేయాలనే నిర్ణయానికి వచ్చారు.

ప్రభుత్వ విధానం, అమరావతిలో ఉన్న రాజకీయాలు, భూముల స్థితిగతులు ఏవీ జగన్ కాలుమోపేందుకు అనుకూలంగా లేవు. ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ లాగా విశాలంగా కార్యాలయం కట్టుకోవడం అమరావతిలో కుదరదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప నాలుగెకరాల ప్రభుత్వ స్థలం ఆ పార్టీకి  దొరకదు. అంతవరకు మంగళగిరిలో సర్దుకు పోవలసిందే.

 

మొదట తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు కోసం అన్వేషణ ప్రారంభమయింది. విజయవాడ వద్దనుకున్నారు. గుంటూరు దగ్గిర రెడ్డి పాళెం ను పరిశీలించారు. అనవుగాని చోట భద్రత కూడా ఒక సమస్య అయింది. జగన్ ప్రభుత్వ భద్రత మీద పూర్తిగా ఆదార పడదల్చుకోలేదు. ఆయన కట్టదిట్టమయిన ప్రయివేటు బందోబస్తుతోనే యాత్రలు చేస్తున్నారు. అంతేకాదు, సాధ్యమయినంతవరకు ఎక్కడా రాత్రి బసచేయరు, హైదరాబాద్ కు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక బస చేయాల్సివచ్చినా, ఒక రహస్య ప్రదేశానికి  వెళతారు.  ఇపుడున్న రాజకీయ వాతావరణంలో అమరావతి ప్రాంతంలో భద్రత  కూడా ఒక సమస్య అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  దీనికోసం కూడా ఎక్కడో దూరాన ఉండకుండా, అమరావతి గరిమనాభి అయిన వెలగపూడికి అయిదారు కిలో మీటర్ల దూరంలో పార్టీ హెడ్ క్వార్ట ర్స్ ఉండాలని నిర్ణయించారు.

 

అయితే, అక్కడెక్కడ కొనేందుకు ప్రయివేటు  భూములే  లేవు. ఉన్నా కొనడం, అమ్మడం మీద నిషేధం ఉంది. ఏదో ఒక విధంగా సేకరించాలనుకుంటే ధరలు విపరీతంగా  ఉన్నాయి.  పార్టీ రెండు మూడెకరాల స్థలం  కావాలనుకుంది. అయితే అక్కడ ఎకరా పది, పదిహేనుకోట్ల కంటే తక్కువగా లభించేట్లుగా లేదట. అందుకే, సెక్రటేరియట్ కు రాయేస్తే పడేంత దూరంలో పార్టీ కార్యాలయం కట్టుకోవడం చంద్రన్నరాజ్యంలో జరిగే పని కాదనే నిర్ణయానికి వచ్చేశారు.  అలాకాదంటే  ప్రభుత్వం కేటాయించే భూమే చాలనుకుంటే అది ’గూడు మిద్దె’ కు కూడా పనికిరాదు. పుట్టిన ప్పటి నుంచి వైభవం వెలగబెట్టిన పార్టీకిపుడు అమరావతి ఎడారయింది.

 

ఏ పార్టీకి ఎంత భూమి ఇవ్వాలో ఒక ఫార్ములా కూడా ప్రభుత్వం  తయారుచేసింది. దీని ప్రకారం  ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే అమరావతిలో భారీ భవంతి కట్టుకునేంత స్థలం వస్తుంది. 2016 జూలైలో ప్రకటించిన ఈ నూతన విధానం ప్రకారం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అమరావతిలో  అరెకరా,  జిల్లాలలో 1000 చ.అ జాగాయే దొరుకుతుంది. అది కూడా ఎక్కడ ఇస్తారో చెప్పలేం. కాబట్టి  అమరావతిలో కాలుమోపడం జగన్ కు కష్టమే.

 

 ఈ స్థలాన్ని అసెంబ్లీలో పార్టీలకు ఉన్న సభ్యత్వం  ప్రకారం నిర్ణయించారు. ఈ లెక్క ప్రకారం టిడిపికి నాలుగెకరాలు వస్తాయి. జిల్లాలలో  రెండెకరాలు వస్తాయి.

 

ప్రభుత్వ విధానం, అమరావతిలో ఉన్న రాజకీయాలు, భూముల స్థితిగతులు ఏవీ జగన్ కాలుమోపేందుకు అనుకూలంగా లేవు. ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ లాగా విశాలంగా కార్యాలయం కట్టుకోవడం అమరావతిలో కుదరదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప నాలుగెకరాల ప్రభుత్వం స్థలం ఆ పార్టీకి  దొరకదు. అంతవరకు మంగళగిరిలో సర్దుకు పోవలసిందే.

 

Follow Us:
Download App:
  • android
  • ios