జగన్ పైన విరుచుకుపడిన టిడిపి శ్రేణులు జగన్ దిష్టి బొమ్మ దగ్దం జగన్ కి బాబును కామెంట్ చెసేంత సినిమా లేదన్న దేవినేని అవినాష్.
జగన్ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో టీడీపీ యువ నాయకులు దేవినేని అవినాష్ నిరసనకు దిగారు. ఆయన ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పై విమర్శలు చేసే అర్హత జగన్ కు లేదన్నారు. కనీసం బాబు దరిదాపుల్లోకి వచ్చేంత దమ్ము, ధైర్యం గానీ జగన్ కి లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. తమ అధ్యక్షుడి పై ఆరోపణలు చేసే సినిమా జగన్ కి లేదని ఆయన అన్నారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపి నిర్వహించి సభలో జగన్ ముఖ్యమంత్రి పై పలు ఆరోపణలు చేశారు. అందులో ప్రధానంగా చంద్రబాబును కాల్చి చంపాలని ఆయన అన్నారు. అంతేకాక బాబు ఎన్నుపోటు పొడవడంలో బాగా ఆరితేరారని ఆయన విమర్శించారు. జగన్ వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. విజయవాడ, వైజాగ్, కర్నూల్ లల్లో టిడిపి నాయకులు రోడ్డు పైకి వచ్చి జగన్ ఫోటో దగ్దం చేశారు. జగన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
