అమెరికా నుండి ఢిల్లీలో దిగిన వెంటనే చంద్రబాబునాయుడు సుమారు 8 గంటలపాటు ఏమయ్యారో చెప్పాలంటూ జగన్ డిమాండ్ చేసారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, పారదర్శకత గురించి నిత్యమూ మాట్లాడుతున్న చంద్రబాబు తాను అదృశ్యమైన విషయాన్ని మాత్రం ఎందుకు దాచిపెడుతున్నారంటూ ప్రశ్నించారు.

అమెరికా నుండి ఢిల్లీలో దిగిన వెంటనే చంద్రబాబునాయుడు సుమారు 8 గంటలపాటు ఏమయ్యారో చెప్పాలంటూ జగన్ డిమాండ్ చేసారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, పారదర్శకత గురించి నిత్యమూ మాట్లాడుతున్న చంద్రబాబు తాను అదృశ్యమైన విషయాన్ని మాత్రం ఎందుకు దాచిపెడుతున్నారంటూ ప్రశ్నించారు. ముందు 8 గంటలపాటు చంద్రబాబు ఎందుకు మాయమైపోయారో చెప్పాలంటూ నిలదీసారు.

తాను ప్రధానిని కలిసిన విషయమై చంద్రబాబు, మంత్రులు, నేతలు చేస్తున్న రాద్దాంతాన్ని కొట్టి పారేసారు. చంద్రబాబు మాయమైపోయిన విషయంపై ముందు వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేసారు. తాను ప్రధానిని కలిసిన విషయంలో ఎటువంటి రహస్యం లేదన్నారు. తాను చంద్రబాబుపై ఫిర్యాదు చేయాలంటే ప్రధానికి కాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫిర్యాదు చేయాలా అని మీడియాను నిలదీసారు. ప్రధాని కార్యాలయం నుండి కబురు రాగానే మరుసటి రోజు తెల్లవారే ఢిల్లీకి వెళ్ళిపోయినట్లు చెప్పారు. ఢిల్లీలో ప్రధానిని కలవక ముందే తాను మీడియాతో చెప్పానన్నారు. మోడిని కలిసిన వెంటనే మళ్లీ మీడియాతో అన్నీ వివరాలు పంచుకున్నట్లు తెలిపారు.

ఈనెల 10వ తేదీన ప్రధానితో తన భేటీపై ఓ మీడియా హౌస్ రాసిందంతా ఉత్త చెత్తగా జగన్ కొట్టి పారేసారు. ఫిబ్రవరి 17వ తేదీన ప్రధానికి తాను రాసిన లేఖకు ఏప్రిల్ 13వ తేదీన ప్రధాని కార్యాలయం నుండి జవాబు కూడా వచ్చిందన్నారు. తనపై అక్కసుతోనే మీడియా హౌస్ చెత్తరాసిందన్నారు. తాను ఏం చెప్పినా పారదర్శకంగానే చేస్తున్నట్లు చెబుతూనే, చంద్రబాబు మాత్రమే చీకటి సమావేశాలు, ఒప్పందాలు చేసుకుంటారని ఎద్దేవా చేసారు.

చంద్రబాబుపై అమెరికా పోలీసులకు అందిన ఫిర్యాదు గురిచిం కూడా వివరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో కూలీలను కాల్చి చంపిన తర్వాత కడుపుమండిన బాధితులెవరో అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసారు. చంద్రబాబు వల్ల ఇతరత్రా నష్టపోయిన వారి తాలూకు కూడా ఫిర్యాదు చేసి ఉండవచ్చు కదా అంటూ ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబుపై తాము ఫిర్యాదు చేయటం వల్ల తమకు వచ్చే ఉపయోగం ఏమీ లేదని కూడా అన్నారు.