వైసీపీ నుండి 21 మంది ఎంఎల్ఏలను చంద్రబాబు లాక్కున్న విధానంతో పాటు నలుగురు ఫిరాయింపులకు మంత్రిపదవులు కట్టబెట్టటాన్ని కూడా జగన్ స్సష్టం చేసారట.

రాష్ట్రంలోని ఫిరాయింపులపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి చంద్రబాబునాయుడు పాతర వేస్తున్నట్లు జగన్ తన ఫిర్యాదులు పేర్కొన్నారు. పోయిన ఎన్నికల్లో ఏ పార్టీ తరపున ఎంతమంది ఎంఎల్ఏలు గెలిచింది వివరించారు. వైసీపీ నుండి 21 మంది ఎంఎల్ఏలను చంద్రబాబు లాక్కున్న విధానంతో పాటు నలుగురు ఫిరాయింపులకు మంత్రిపదవులు కట్టబెట్టటాన్ని కూడా జగన్ స్సష్టం చేసారట. రాష్ట్రంలో జరుగతున్న రాజకీయ పరిణామాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ జగన్ ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసారు. జగన్ వెంట ఎంపిలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి అవినాష్ రెడ్డి, వరప్రసాద్, విజయసాయిరెడ్డి తదితరులు కూడా ప్రణబ్ ను కలిసారు. పాపం మరో రెండు మాసాల్లో దిగిపోయే రాష్ట్రపతి మాత్రం ఏం చెబుతారు. జగన్ చెప్పినది విని పరిశీలిస్తానని హామీ ఇచ్చారట.

ఫిరాయింపుల వ్యవహారానికి ఇక్కడితో ఆపకపోతే ఈ జాడ్యం ప్రతీ రాష్ట్రానికి పాకుతుందని తాను రాష్ట్రపతికి వివరించానని జగన్ మీడియాకి చెప్పారు. తన పర్యటనలో భాజపాను ప్రభావితం చేయగలిగిన వారిని కలవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానన్నారు. చంద్రబాబు అనైతిక కార్యక్రమాన్ని, ఓటుకునోటు కోట్లు అంశాన్ని, చంద్రబాబు పాల్పడుతున్న అవినీతిని, కాగ్ నివేదిక...ఇలా ప్రతీ అంశాన్నీ జాతీయ స్ధాయిలో ఎండగడతానని చెప్పారు. అందుకే తాను ఢిల్లీకి వచ్చినట్లు స్పష్టంగా చెప్పారు. వ్యవస్ధను కాపాడుకోకపోతే త్వరలో కుప్పకూలిపోతుందని తాను రాష్ట్రపతికి వివరించానని కూడా జగన్ చెప్పారు.