అమ్మ కోసమే..: షాకింగ్ విషయాలు వెల్లడించిన "జబర్దస్త్" హరి

Jabardasth Hari reveals, why he became a red sanders smuggler
Highlights

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడైన జబర్దస్త్ కమెడియన్ శ్రీహరి అలియాస్ హరిబాబు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించాడు. అతను మంగళవారంనాడు టాస్క్ ఫోర్స్ ఐజి కాంతారావు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. 

తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడైన జబర్దస్త్ కమెడియన్ శ్రీహరి అలియాస్ హరిబాబు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించాడు. అతను మంగళవారంనాడు టాస్క్ ఫోర్స్ ఐజి కాంతారావు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. 

ఆ సందర్భంగా అతను పలు విషయాలు వెల్లడించాడు. మొదట తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పిన అతను ఆ తర్వాత జల్సాలకు అలవాటుపడి భారీ మొత్తాల్లో అప్పు చేసి ఉద్యోగం మానేసినట్లు తెలిపాడు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తీసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. వాటిని తీర్చేందుకు చాలా కష్టపడ్డానని చెప్పాడు. తన తల్లి ఆరోగ్యం విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపాడు.

నాలుగేళ్ల క్రితం తన తల్లి తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారని, ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యహరించారని చెప్పాడు. దాంతో డబ్బుల కోసం స్నేహితుడి ద్వారా మొదటిసారి స్మగ్లింగ్‌ చేసి వచ్చిన డబ్బులతో తల్లికి చికిత్స చేయించినట్లు తెలిపాడు. అయితే మొదటిసారి తనపై ఓ కేసు నమోదైందని, ఆ తర్వాత తనకు సంబంధం లేకున్నా నాలుగేళ్ల తర్వాత మరో కేసు పెట్టారని అతను చెప్పాడు. 

గతంలో తనతో కలిసి పనిచేసిన శ్రీనివాసులురెడ్డి దొరికిపోయి ఏం చేయాలో పాలుపోక తనపేరు చెప్పాడని అతను ఆరోపించాడు. అయితే గతంలో తనపై నమోదైన తొలికేసు సమయంలో తాను స్మగ్లింగ్‌ చేయడం నిజమే కాబట్టి నిజాయితీగా తాను లొంగిపోయానని, ఆ కేసులో శిక్ష అనుభవించేందుకు సిద్ధమని తెలిపాడు హరిబాబు. 

తాను ఎప్పుడో వదిలేసిన స్మగ్లింగ్ కు ప్రస్తుతం తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తూ ఆ కారణంతోనే నాలుగేళ్లు తనపేరు మీడియాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించాడు. అర్బన్‌ జిల్లాలో ఉన్న ఏ కేసులతోనూ తనకు సంబంధం లేదని, శ్రీనివాసులు రెడ్డి ఓ ఎస్‌ఐతో కలిసి స్లగ్లింగ్‌ చేశాడని చెప్పాడు. 

బెంగళూరులో దుంగలు అమ్మి ఎస్‌ఐ డబ్బులు ఖాతాలో వేసేవాడని, అయితే వాటికి సంబంధించిన రశీదులు శ్రీనివాసులు రెడ్డి వద్ద ఉన్నాయని టాస్క్‌ఫోర్స్‌కు చెప్పాడు. 

loader