జబర్దస్త్‌లో అమ్మాయి వేషంతో నవ్వించిన నటుడే.. "స్మగ్లర్"

jabardasth hari as red sandalwood smuggler
Highlights

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి వినోదాన్ని అందజేస్తున్న జబర్దస్త్ షో లో నటిస్తున్న ఓ నటుడు శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసి కోట్లు కూడబెట్టాడన్న వార్తలు రావడంతో తెలుగు ప్రజలు ఉలిక్కిపడ్డారు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి వినోదాన్ని అందజేస్తున్న జబర్దస్త్ షో లో నటిస్తున్న ఓ నటుడు శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసి కోట్లు కూడబెట్టాడన్న వార్తలు రావడంతో తెలుగు ప్రజలు ఉలిక్కిపడ్డారు.  మీడియాలో వార్తలు వచ్చిన కొద్దిసేపటికే  ఆ నటుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. నిన్న అతని ఫోటో బయటికి వచ్చినప్పటికీ.. అతని పేరు గురించి కానీ.. ఎవరి టీమ్‌లో వేశాడన్నది మాత్రం బయటకు రాలేదు.

ఇవాళ అతనికి సంబంధించిన వివరాలను మీడియాకు విడుదల చేశారు పోలీసులు.. అతని పేరు హరి... పలు స్కిట్లలో అమ్మాయి వేషంతో అలరించినట్లుగా తెలుస్తుంది.. జబర్దస్త్‌లో చేస్తూనే ఎర్రచందనం స్మగర్లతో  సన్నిహిత సంబంధాలు పెట్టుకుని స్మగ్లింగ్‌కు పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఇతనిపై ఇప్పటి వరకు 20 కేసులున్నాయని.. వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది.

loader