అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ కు చేరుకున్నారు.

సుమారు 4 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇవాంక నేరుగా మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్ కు చేరుకున్నారు. అంతకు ముందు ఆమెకు శంషాబాద్‌ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు.

 అక్కడి నుండి నేరుగా తన బసకు చేరుకున్నారు. తొలుత ఇవాంకా వెస్టన్ హోటల్లో బస చేస్తారని ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, భద్రతా కారణాల రీత్యా చివరి నిముషంలో  ఆమె బసను ట్రైడెంట్‌కు మార్చారు. కాగా ఆమె మధ్యాహ్నం 2.40కి హెచ్‌ఐసీసీకి బయల్దేరనున్నారు.

గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన ఇవాంకా బుధవారం రాత్రికి తిరిగి అమెరికాకు బయలుదేరుతారు