రాజమండ్రిలో నిర్వహించిన ఓ సమావేశంలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. తనకు కేఎల్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వడం ఆనందంగా ఉందని, అలాగే మంత్రి పదవి కూడా ఇస్తే బాగుండని వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం జగన్ పాలన బాగుందని సినీ నటుడు అలీ కితాబిచ్చారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన ఓ సమావేశంలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. తనకు కేఎల్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే మంత్రి పదవి కూడా ఇస్తే బాగుండని సరదాగా వ్యాఖ్యానించారు. జగన్ చాలా చక్కగా పరిపాలిస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలను సమానంగా చూస్తూ వారికి న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. త్వరలోనే ఆన్‌లైన్ టికెట్ విధానం వల్ల ఏర్పడ్డ గందరగోళానికి పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తను పుట్టిన ఊరిలో ఈ అవార్డు అందుకోవడం మర్చిపోలేని అన్నారు.
మాయలేడి: వ్యాక్సిన్ పేరుతో ఇంట్లోకి .. కళ్లలో డ్రాప్స్ వేసి, చైన్‌తో పరార్
‘‘మంత్రి పదవి’’ వ్యాఖ్యలపై చర్చ..
జగన్ తనకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని అలీ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలు సరదాగా చేయలేదని తన మనసులో ఉన్న మాటను ఇలా సభా వేధికగా భయటపెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అలీకి మొదటి నుంచి రాజకీయాలు అంటే కొంత ఆసక్తే. 1999 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. నటుడు మురళి మోహన్ అలీని టీడీపీలోకి ఆహ్వానించారు. అయితే అప్పటి నుంచి ఆయనకు టీడీపీకి మద్దతుగా ఉన్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పలు సందర్భాల్లో టీడీపీ తరుపున ప్రచారం కూడా నిర్వహించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరారు. మంత్రి పదవి ఇస్తేనే తాను వైఎస్ఆర్‌సీపీలో చేరుతాననే హామీ తీసుకున్న తరువాతే ఆయన పార్టీలో చేరారని అప్పట్లో చర్చలు జరిగాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ అలీకి ఆయన కోరుకున్నట్టు మంత్రి పదవి మాత్రం రాలేదు. అయితే ఈ సభ సందర్భంగా పార్టీ ఇచ్చిన హామీని సీఎం జగన్‌కు గుర్తు చేద్దామనే ఉద్దేశంతోనే ఆయన ఈ కామెంట్స్ చేశారని అర్థమవుతోంది. మరి సీఎం జగన్ ఆయన కోరిక నెరవేరుస్తారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
