వైసిపి నేత వేమిరెడ్డి పై ఐటి దాడులు

వైసిపి నేత వేమిరెడ్డి పై ఐటి దాడులు

తెలుగుదేశంపార్టీ మార్కు వేధింపులు మొదలయ్యాయి. టిడిపిలోకి వస్తారనుకున్న నేతలు వైసిపిలోకి చేరుతుండటంతో టిడిపి నేతలు తట్టుకోలేక పోతున్నారు. ఉక్రోషాన్ని అణుచుకోలేక తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనం. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

పాదయాత్రలో ఉన్న జగన్ తో భేటీ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపిలో చేరారు. దాంతో టిడిపి నేతలకు షాక్ తగిలినట్లైంది. ఎందుకంటే, ఇంతకాలం వేమిరెడ్డిని టిడిపిలోకి చేర్చుకోవాలని సైకిల్ నేతలు చాలా ప్రయత్నాలే  చేశారు. కానీ ఎందువల్లో వర్కవుట్ కాలేదు. దాదాపు మూడు సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న వేమిరెడ్డి ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. వెంటనే జగన్ ను కలవటం, వైసిపిలో చేరటం చకచక జరిగిపోయాయి.

వేమిరెడ్డి తమపార్టీలో చేరుతారని టిడిపి నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎందుకంటే, వేమిరెడ్డి ఆర్ధికంగా బలమైన వ్యక్తి. విపిఆర్ పేరుతో అంతర్జాతీయస్ధాయిలో కాంట్రాక్టులు చేస్తుంటారు. ఆర్ధికంగా అంతటి బలమైన వ్యక్తి వైసిపిలో చేరకుండా టిడిపి నేతలు చాలా ప్రయత్నాలే చేశారు. కానీ అడ్డుకోలేకపోయారు.

ఎప్పుడైతే వేమిరెడ్డి వైసిపిలో చేరారో వెంటనే టిడిపి నేతలకు మండిపోయింది. దాని ఫలితమే వేమిరెడ్డి కార్యాలయాలు, ఇళ్ళు,బంధువుల ఇళ్లపైన కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. అయితే, వాళ్ళ సోదాల్లో ఏమి కనబడలేదట. ప్రతీ దానికి పక్కాగా లెక్కలున్నాయట. దాంతో చేసేది లేక ఏవోవ్యాపారాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలడిగి వేమిరెడ్డి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. అంటే టిడిపి వరస చూస్తుంటే వైసిపిలోని పారిశ్రామిక వేత్తలు, లేకపోతే చేరాలనుకుంటున్న పారిశ్రామికవేత్తలను హెచ్చరిస్తున్నట్లుగా లేదూ?

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page