ప్రాంతాలు వేరైనా.. పార్టీలు వేరైనా రాజకీయ నాయకులది ఒకటే కులం.. అందుకే ఎప్పుడు ఒకే మాట మీద ఉంటారు.. ఒకేలా ప్రవర్తిస్తుంటారు..వీరిలో మెజార్టీ జనాలు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేసేందుకు కాదు.. కోట్లను కూడబెట్టుకోవడానికే.

తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల్లో ఈ విషయం మరోసారి రుజువయ్యింది. తమిళనాడుకు చెందిన పలువురు పేరుమోసిన రాజకీయ నేతలు..తమ డబ్బును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకుల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.

వీవీ మినరల్స్ యజమాని వైకుందరాజన్ సారథ్యంలోని పలు మైనింగ్ కంపెనీల్లో మెజార్టీ నేతల పెట్టుబడులు ఉన్నట్లు.. వీటిలో అవకతకవలు జరిగినట్లు ఐటీ అధికారులకు సమాచారం అందడంతో ఉదయం నుంచి రెండు రాష్ట్రాల్లో దాడులకు దిగింది ఆదాయపు పన్ను శాఖ.

మొత్తం 100 ప్రాంతాల్లోని ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ వ్యవహారాలతో సంబంధం ఉందని భావిస్తున్న విశాఖ దువ్వాడ పారిశ్రామిక వాడలోని టీజీఐ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అలాగే నగరంలోని పలు కంపెనీలపై సైతం నిఘా పెట్టారు.

మరోవైపు ఏపీ, తమిళనాడుల్లోని పలువురు ప్రముఖుల ఇళ్లపైనా దాడులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. లిస్ట్‌లో బడా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, హోటళ్ల యజయానుల పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజా ఐటీ దాడులతో మద్రాస్ నుంచి ఉత్తరాంధ్ర వరకు కోస్తా తీరం వణుకుతోంది.

విశాఖలో ఐటీ దాడులు.. ఏకకాలంలో దాడులకు దిగిన 200 మంది సిబ్బంది

ఏపీలో ఐటీ గుబులు:విశాఖలో మకాం వేసిన ఐటీ అధికారులు