ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. సాగరనగరం విశాఖలోని దువ్వాడ పారిశ్రామిక వాడలోని పలు కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ వరల్డ్ బీచ్ శాండ్ కంపెనీతో పాటు టీజీఐ కంపెనీలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

నిన్న సాయంత్రమే హైదరాబాద్,బెంగళూరు, చెన్నై మొదలైన ప్రాంతాల నుంచి 200 మంది వరకు ఐటీ అధికారులు విశాఖకు చేరుకుని పలు చోట్ల మకాం వేశారు. లిస్ట్ రెడీ చేసుకుని.. పక్కా వ్యూహంతో ఈ తెల్లవారుజాము నుంచి దాడులు ప్రారంభించారు. ఐటీ దాడులతో సాగరతీరం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఏపీలో ఐటీ గుబులు:విశాఖలో మకాం వేసిన ఐటీ అధికారులు