సారాంశం

తెలుగుదేశం పార్టీ నేత గుణ్ణం చంద్రమౌళి నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

కాకినాడ: తెలుగుదేశం పార్టీ నేత గుణ్ణం చంద్రమౌళి నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐదు గంటలుగా  చంద్రమౌళి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు మూడు బృందాలు విడిపోయి తనిఖీలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సన్నిహితుడిగా చంద్రమౌళి పేరుంది. అయితే ఆక్వా,  క్వారీ రంగంలో పెట్టుబడులు పెట్టిన చంద్రమౌళి.. ఆదాయంలో తేడాలు  చూపించి ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా ఆరోపణల నేపథ్యంలోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.