భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పీఎస్ఎల్వీ సీ-50ని అంతరిక్షంలోకి పంపింది. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్ 01ను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి మధ్యాహ్నం సరిగ్గా 3.41 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.  మొత్తం ఏడేళ్ల పాటు కక్షలో తిరగనున్న ఈ శాటిలైట్ బరువు మొత్తం 1410 కిలోలు..

పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ ఆకృతిలో 22వది అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిష‌న్ అని భారత అంతరిక్ష సంస్థ తెలిపింది. రాకెట్ ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.