వైసిపిలో 8మందిపై వేటు?..జగన్ సంచలనం

వైసిపిలో 8మందిపై వేటు?..జగన్ సంచలనం

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. తన ఆదేశాలను పట్టించుకోని, పార్టీ కార్యక్రమాలను పక్కన పెట్టిన నేతలను నియోజకవర్గ బాధ్యతల నుండి పక్కన పెట్టాలని నిర్ణయించారని పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల ముందు పార్టీ కార్యక్రమాల అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే కష్టమన్న అభిప్రాయంలో జగన్ ఉన్నట్లు సమాచారం. పాదయాత్ర ప్రారంభించే ముందు జగన్ నియోజకవర్గ సమన్వయకర్తలు, నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.

ఆ సమావేశంలో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టత ఇచ్చారట. పల్లె నిద్ర, నియోజకర్గ స్ధాయిలో పాదయాత్రలు, రచ్చబండ కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు తప్పకుండా నిర్వహించాల్సిందే అని ఆదేశించారు. సమన్వయకర్తలు, నేతలు దాదాపు అందరూ నిర్వహించారు. కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి.

జగన్ ఆదేశాలు అమలైన విధానంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మొత్తం 175 నియోజకవర్గాలపై ఓ నివేదిక అందించారట. ఆ నియోజకవర్గంలో జగన్ ఆదేశాలు ఎనిమిది నియోజకవర్గాల్లో  అమలు కాలేదని స్పష్టం చేశారట. కార్యక్రమాల అమలులో సదరు సమన్వయకర్తలు పూర్తి నిర్లక్ష్యం వహించినట్లు ఫిర్యాదులు కూడా అందిందట. దాంతో ఎనిమిది మంది సమన్వయకర్తలపై జగన్ మండిపడ్డారట. తర్వలో వారిని సమన్వయకర్తలుగా తొలగించాలని నిర్ణయించారట. అయితే, ప్రశాంత్ కిషోర్ నివేదికలో ఇచ్చిన ఆ నయోజకవర్గాలేవి అన్న విషయంపై పార్టీలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయట.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos