రాయపాటి మాటల వెనుక ఏమన్నా ప్లాన్ ఉందా?

అదేంటి రాయపాటి సాంబశివరావు రివర్స్ లో మాట్లాడుతున్నారే? లోకమంతా ఒకలాగ మాట్లాడుతుంటే, రాయపాటి మాత్రం ఇంకోలా మాట్లాడుతున్నారు. రాష్ట్రమంతా చంద్రబాబు ఏలుబడిలో ‘కమ్మ’గా ఉందని గోలపెడుతుంటే, నరసరావుపేట ఎంపి మాత్రం కమ్మవాళ్లకు చంద్రబాబు ఏమీ చేయటం లేదని ఆరోపించటం విచిత్రంగా ఉంది. కమ్మ కులాన్ని అసలు పట్టించుకోవటం లేదట. పార్టీ కోసం పనిచేసే వారిని ఏమాత్రం పట్టించుకోవటం లేదట. సరే ఇందులో నిజముందనుకోండి. ఓట్లు, తన పదవి కోసమే చంద్రన్న ఓ కులానికే కొమ్ము కాస్తున్నారంటూ మండిపడ్డారు. పైగా తాను జూనియర్ ను కాబట్టే చంద్రబాబును గట్టిగా ప్రశ్నించలకున్నారట. వాటే క్యామెడి రాయపాటి జి. పార్టీలోని కమ్మ నేతలు కూడా ఈ విషయాన్ని చంద్రబాబును ప్రశ్నించేస్ధితిలో లేరని అంటున్నారు. ఎంపి. చంద్రబాబు వైఖరి పార్టీ మనుగడుకు ఏమాత్రం మంచిది కాదని కూడా సుద్దులు చెబుతున్నారు.

 ప్రభుత్వంలో రిటైర్డ్ ఐఏఎస్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారని, అదంత మంచిది కాదని కూడా చెబెతున్నారు. ఏ ఐఏఎస్ పైన రాయపాటికి మంటగా ఉందో మరి? గుంటూరులోని కమ్మజనసేవా సమితిలో జరిగిన సమావేశంలో రాయపాటి చెప్పినవాటిల్లో కొన్ని నిజమేగానీ మిగిలిన మాత్రం నమ్మేట్లుగా లేవు. మరి రాయపాటి ఎందుకు ఇదంతా చెప్పినట్లు? అసలు రాయపాటి మాటల వెనుక ఏమన్నా ప్లాన్ ఉందా?