చెన్నైలోని ఆర్కె నగర్ ఉపఎన్నికల్లో తెలుగు ప్రజలు కీలక పాత్ర పోషించారా? అవుననే అంటున్నారు తమిళనాడు తెలుగుయువత అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. స్వతంత్ర అభ్యర్ధిగా టిటివి దినకరన్ గెలుపుకు తెలుగు ఓటర్లే ప్రధాన కారణమని కేతిరెడ్డి చెప్పారు. తమిళ ఓటర్లలో వివిధ పార్టీల మద్య స్పష్టమైన విభజన కనిపించిందన్నారు. ఏఐఏడిఎంకెలో రెండు వర్గాలుండటం, డిఎంకె కూడా జయలలిత మరణం తర్వాత ఏఐఏడిఎంకె అంతర్గత కుమ్ములాటల నుండి లబ్ది పొందాలని ప్రయత్నించటం తదితర కారణాలతో జనాల మద్దతును కోల్పాయినట్లు అభిప్రాయపడ్డారు. అయితే, దినకరన్ గెలుపులో డబ్బు కీలక పాత్ర పోషించినట్లు కేతిరెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉండి కూడా ఏఐఏడిఎంకె ఉపఎన్నికలో లబ్ది పొందలేక పోవటమే ఆశ్చర్యంగా ఉందన్నారు. అలాగే, జయలలిత పోటీలో ఉన్నపుడే భారీ ఓట్లను సాధించిన డిఎంకె తాజా ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవటంపై అనుమానాలు వ్యక్తం చేసారు.