టీడీపీ-బీజేపీ పొత్తుపై ఊహగానాలు : పాత స్నేహం బలపడుతుందా?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కొత్త కూటములు తెరమీదికి వచ్చే అవకాశం ఉంది.  టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కూడ  చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.

Is TDP set to join NDA again?

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ఢిల్లీకి వెళ్లారు. బీజేపీతో పొత్తు విషయమై  చర్చలు జరిపేందుకు  ఢిల్లీ వెళ్తున్నారని ప్రచారం సాగుతుంది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో  గతంలో కూడ తెలుగు దేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. కొన్ని కారణాలతో  ఆ పార్టీకి దూరమైన విషయం తెలిసిందే.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలతో సుదీర్ఘ కాలం పాటు  తెలుగు దేశం పార్టీ పొత్తు కొనసాగింది.  కొంత కాలం బీజేపీతో కూడ  తెలుగు దేశం పార్టీ పొత్తు  ఉంది. 

1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ  ఒంటరిగానే పోటీ చేసింది.  ఆ ఎన్నికల్లో  తెలుగు దేశం పార్టీ  రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుంది.  ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో  ఎన్‌టీఆర్ ను గద్దెదించి  నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  ఈ సమయంలో సీపీఐ,సీపీఐ(ఎం), భారతీయ జనతా పార్టీలు టీడీపీకి మద్దతుగా నిలిచాయి.  ఆ తర్వాత 1985లో జరిగిన  ఎన్నికల్లో  లెఫ్ట్ పార్టీలు  తెలుగుదేశం పార్టీతో పొత్తును పెట్టుకున్నాయి. అప్పటి నుండి  సీపీఐ, సీపీఐ(ఎం)లు సుదీర్ఘ కాలం పాటు  తెలుగు దేశం పార్టీతో  పొత్తును కొనసాగించాయి. 1989, 1994,  అసెంబ్లీ ఎన్నికలతో పాటు  1996, 1998 ఎన్నికల్లో కూడ  సీపీఐ, సీపీఐ(ఎం)లతో కలిసి  పోటీ చేశాయి. అయితే ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  చంద్రబాబు  బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. 

1999 పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో  టీడీపీ పొత్తు తెగదెంపులు చేసుకుంది.   ఈ ఎన్నికల్లో  బీజేపీ, టీడీపీలు కలిసి పోటీ చేశాయి.  2004 వరకు  ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగింది.  2004 ఎన్నికల్లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో , కేంద్రంలో కూడ  బీజేపీ  అధికారాన్ని కోల్పోయింది.  ఆంధ్రప్రదేశ్ లోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్  పార్టీ అధికారాన్ని దక్కించుకుంది.

20014 వరకు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ  చంద్రబాబు అధికారానికి దూరంగా ఉన్నాడు. 2014 ఎన్నికలకు ముందు  బీజేపీకి చంద్రబాబు దగ్గరయ్యారు. 2014 ఎన్నికల్లో  బీజేపీ, టీడీపీ మధ్య మరోసారి పొత్తు కుదిరింది.  2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగు దేశం పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. కేంద్రంలో బీజేపీ సర్కార్ లో  బీజేపీ చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ చేరింది.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  చంద్రబాబు నాయుడు  బీజేపీకి దూరమయ్యాడు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై విమర్శలు గుప్పించారు.   అయితే  2019 ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగు దేశం పార్టీ ఓటమి పాలైంది.  

రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  మరోసారి  బీజేపీకి  తెలుగు దేశం పార్టీ దగ్గరకానుంది. ఇవాళ  చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీకి వెళ్లారు. బీజేపీతో పొత్తుపై చర్చలు జరపనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  బీజేపీతో టీడీపీ పొత్తు విషయమై  చర్చలు జరిపేందుకు  చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లారు.గతంలో కూడ  తెలుగు దేశం పార్టీ బీజేపీతో పొత్తు ఉంది. బీజేపీతో పొత్తును కూడ  టీడీపీ తెగదెంపులు చేసుకున్న సందర్భాలు కూడ ఉన్నాయి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios