టిడిపికి గుడ్ బై చెప్పేఆలోచనలో ‘చల్లా’: చంద్రబాబుకు షాక్

First Published 12, Apr 2018, 10:44 AM IST
Is tdp senior leader challa decided to say goodbye to party
Highlights
రాయలసీమ ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ పదవి ఇచ్చిన విషయంలో చంద్రబాబుపై మండిపోతున్నారు.

చంద్రబాబునాయుడుకు కర్నూలు జిల్లా సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి పెద్ద షాకే ఇచ్చారు. రాయలసీమ ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ పదవి ఇచ్చిన విషయంలో చంద్రబాబుపై మండిపోతున్నారు.

తనను చంద్రబాబు అవమానించారని ధ్వజమెత్తతున్నారు. తనకన్నా జూనియర్ కు ఆర్టీసీ ఛైర్మన్ కట్టబెట్టి ఐదుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన తనకు ఒక రీజియన్ స్ధాయి ఛైర్మన్ ఇచ్చి సరిపెడతారా అంటూ నిలదీశారు.

తాను రీజియన్ ఛైర్మన్ పదవి తీసుకునేందుకు సిద్దంగా లేనని తెగేసి చెప్పారు.

టిడిపిలో చేర్చుకునేటపుడే తనకు ఎంఎల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పినట్లు మండిపడ్డారు. అడుగడుగునా అవమానిస్తున్న టిడిపిలో కొనసాగటంపై చల్లా తీవ్ర ఆలోచనలో ఉన్నట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

 

loader