Asianet News TeluguAsianet News Telugu

టిడిపిలో ప్రశాంత్ కలవరం మొదలైందా?

వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం సాధించటం కోసం ప్రశాంత్ తో ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయం తెలిసిందో అప్పటి నుండి టిడిపిలో కలవరం మొదలైందన్నది వాస్తవం. అందుకే ప్రశాంత్ గురించి టిడిపి నేతలు వీలైనపుడల్లా చులకనగా మాట్లాడుతున్నారు.

Is tdp scared of political analyst prasant kishore

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటేనే టిడిపి నేతలు భయపడుతున్నారు. ప్రశాంత్ అంటే టిడిపి ఎందుకంత భయపడుతోందంటే ప్రశాంత్ కున్న ఇమేజ్ అటువంటిది కాబట్టే. వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం సాధించటం కోసం ప్రశాంత్ తో ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయం తెలిసిందో అప్పటి నుండి టిడిపిలో కలవరం మొదలైందన్నది వాస్తవం. అందుకే ప్రశాంత్ గురించి టిడిపి నేతలు వీలైనపుడల్లా చులకనగా మాట్లాడుతున్నారు.

శుక్రవారం మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా తమకు ఏమీ కాదన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రశాంత్ వ్యూహాలు విఫలమైన సంగతిని దేవినేని గుర్తు చేసారు. అయితే, మంత్రి మరచిపోయిన విషయం ఇక్కడ ఒకటుంది. యుపిలో ప్రశాంత్ విఫలమవ్వలేదు. ప్రశాంత్ వ్యూహాలను కాంగ్రెస్సే ఆచరణలో పెట్టలేకపోయింది. ఆ విషయాన్ని స్వయంగా రాహూల్ గాంధీనే మీడియాతో చెప్పారు.

మరి, ఇదే ప్రశాంత్ వ్యూహాలను ఆచరణలో పెట్టేకదా పంజాబ్ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ విషయం బహుశా మంత్రికి గుర్తు లేదోమో. అంతుకుముందు నరేంద్రమోడి, నితీష్ కుమార్ కూడా ప్రశాంత్ సేవలు వాడుకుని లాభపడ్డారు కదా?  వారి సంగతిని మంత్రి ఎలా మరచిపోయారు? అంటే తమకు ఇబ్బంది లేనివి మాత్రమే టిడిపి నేతలు గుర్తుంచుకుని మిగిలినవి మరచిపోతారన్నమాట. అయినా, పోటీ చంద్రబాబునాయుడు-జగన్మోహన్ రెడ్డికి మధ్య అయితే సలహాలిచ్చే ప్రశాంత్ గురించి మాట్లాడాల్సిన అవసరం టిడిపికి ఏంటి?