ఈనెలాఖరులో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తున్నారా ? అవుననే అంటున్నాయ్ టిడిపి వర్గాలు. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈనెల 29వ తేదీన పార్టీతో పాటు శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఈనెలాఖరులో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తున్నారా ? అవుననే అంటున్నాయ్ టిడిపి వర్గాలు. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈనెల 29వ తేదీన పార్టీతో పాటు శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. విదేశీ పర్యటనలో ఉన్న టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి ఈనెల 26వ తేదీన విజయవాడకు తిరిగి వస్తారు. తర్వాత మూడు రోజులకు రేవంత్ ఏపి ముఖ్యమంత్రిని కలవనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. టిడిపి ఎంఎల్ఏగా రాజీనామా ఇచ్చి మళ్ళీ పోటీ చేసి గెలవాలన్నది రేవంత్ ఆలోచనట. మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుండి పోయిన ఎన్నికల్లో రేవంత్ గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే.
మరి, ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తారా లేక ఏదైనా పార్టీ తరపున పోటీ చేస్తారా అన్నది తేలలేదు. ఎందుకంటే, నవంబర్ 9న గానీ లేక డిసెంబర్ 9న కానీ రేవంత్ కాంగ్రెస్ లో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి రేవంత్ కాంగ్రెస్ లో చేరే విషయం తేలిపోతుంది. ఏదేమైనా, టిడిపితో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయటమంటే రేవంత్ రెడ్డి పెద్ద సాహసం చేస్తున్నట్లే లెక్క.
