Asianet News TeluguAsianet News Telugu

80 % జనాల్లో నిజంగానే సంతృప్తి ఉందా?

  • చంద్రబాబునాయుడు ఈమధ్య తరచూ రెండుమాటలు చెబుతున్నారు. అదేంటంటే, 2019 ఎన్నికల్లో టిడిపి మొత్తం 175 సీట్లూ సాధిస్తుందని, తన ప్రభుత్వం పట్ల జనాల్లో 80 శాతం సంతృప్తి ఉందని.
  • చంద్రబాబు చెప్పుకుంటున్నట్లు నిజంగానే ప్రజలు 80 శాతం ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారా? 175 సీట్లూ సాధించటం టిడిపికి సాధ్యమేనా?
  • వారం క్రితమే ప్రారంభమైన ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమం జరుగుతున్న విధానం చూస్తుంటే ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది.
  • కార్యక్రమంలో భాగంగా తమ వద్దకు వస్తున్న మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలకు చాలా చోట్ల జనాలు సమస్యలను చెప్పుకుంటున్నారు. పలుచోట్ల నిలదీస్తున్నారు.
  •  
Is really 80 percent public are happy with naidus govt

చంద్రబాబునాయుడు ఈమధ్య తరచూ రెండుమాటలు చెబుతున్నారు. అదేంటంటే, 2019 ఎన్నికల్లో టిడిపి మొత్తం 175 సీట్లూ సాధిస్తుందని, తన ప్రభుత్వం పట్ల జనాల్లో 80 శాతం సంతృప్తి ఉందని.  పై రెండు విషయాలు నిజమా కాదా అన్నది వదిలేస్తే చంద్రబాబు చెప్పారు కాబట్టి పుత్రరత్నం లోకేష్ తదితరులు కూడా ఎటూ అవే మాటలు చెబుతున్నారు. అయితే, ఇక్కడే ఓ సందేహం వస్తోంది. చంద్రబాబు చెప్పుకుంటున్నట్లు నిజంగానే ప్రజలు 80 శాతం ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారా? 175 సీట్లూ సాధించటం టిడిపికి సాధ్యమేనా?

వారం క్రితమే ప్రారంభమైన ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమం జరుగుతున్న విధానం చూస్తుంటే ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. అదేంటంటే, కార్యక్రమంలో భాగంగా తమ వద్దకు వస్తున్న మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలకు చాలా చోట్ల జనాలు సమస్యలను చెప్పుకుంటున్నారు. పలుచోట్ల నిలదీస్తున్నారు. దాన్ని తట్టుకోలేని మంత్రులు, నేతలు, పార్టీ యంత్రాంగం ఎదురుదాడికి దిగుతున్నారు. చివరకు స్వయంగా చంద్రబాబు కూడా శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామంలో పాల్గొన్నారు.

అంటే, జరుగుతున్న విషయాలన్నీ ఎప్పటికప్పుడు చంద్రబాబు దృష్టికి వస్తున్నాయి కాబట్టే తాను కూడా రంగంలోకి దిగారన్న విషయం అర్ధమవుతోంది. నాజంగానే చంద్రబాబు చెప్పుకుంటున్నట్లు 80 శాతం జనాలు తన పాలన పట్ల సంతృప్తిగా ఉంటే ఇంత గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఏదో పార్టీ శ్రేణుల కోసం వంద చెబుతుంటారు అధినేతలు. అవన్నీ నిజాలని అనుకునేందుకు లేదు. మూడు రోజుల క్రితం ప్రభుత్వ పథకాల అములులో 41 శాతం జనాలు అసంతృప్తిగా ఉన్నారంటూ స్వయంగా చంద్రబాబే చెప్పటం గమనార్హం. చంద్రబాబు నోట ఆమాట విన్న నేతలందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. అంటే వాస్తవం ఏంటో చంద్రబాబుకు కూడా బాగా తెలుసు.

ఇక, 175 సీట్ల సంగతి చూద్దాం. ‘‘నంద్యాల, కాకినాడలో గెలిచేసింది కాబట్టి 2019లో కూడా 175 సీట్లూ సాధించేసి అధికారంలోకి మనమే వచ్చేస్తాం’’ అనుకుంటే టిడిపి పుట్టి ముణగటం ఖాయం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే తక్షణ సమస్య చంద్రబాబుకే గానీ నేతలెవరికీ కాదు. ఆ విషయం చంద్రబాబుకే బాగా తెలుసు. అందుకనే అందరికన్నా తానే ఎక్కువగా కష్టపడుతున్నారు. ప్రతీ చోటా ఆయనే కనబడుతున్నారు. 80 శాతం జనాల్లో సంతృప్తి సంగతేంటో వారం రోజులుగా అందరూ చూస్తున్నారు. ఇక, 175 సీట్ల ముచ్చట చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios