వైసిపి అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫాలో అవుతున్నారా? ఏపిలో పవన్ టూరు ప్రోగ్రాంను గమనిస్తే అందరికీ అదే అనుమానాలు మొదలయ్యాయి. జనసేన పార్టీ కార్యాలయం నుండి పవన్ సంతకంతో టూర్ ప్రోగ్రాం విడుదలైంది. ‘చలొరే చలొరే చల్’ అనే పేరుతో జరుగుతున్న టూర్ ఏపిలో మొదటి ప్రోగ్రాం కావటం గమనార్హం. అసలు టూరును తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాలో మొదలుపెట్టిన పవన్ ఏపిలో మాత్రం అనంతపురంతో మొదలుపెడుతున్నారు.

అయితే, టూర్ ప్రోగ్రాంను చూస్తే మొన్నటి ప్రజాసంకల్పయాత్రలో జగన్ టూరు సాగిన రీతిలోనే సాగుతుండటం గమనార్మం. జగన్ కూడా తన అనంతపురం టూరును గుత్తి నియోజకవర్గంతోనే మొదలుపెట్టారు. తర్వాత ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, తాడిపత్రి, రాప్తాడు తదితర నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇపుడు పవన్ జిల్లా పర్యటన కూడా గుత్తితో మొదలై తర్వాత కదిరి, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో ముగుస్తోంది. కాకపోతే జగన్ పాదయాత్ర కదిరి నుండి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తే, పవన్ మాత్రం హైదరాబాద్ కు చేరుకుంటున్నారు అంతే తేడా.