Asianet News TeluguAsianet News Telugu

నంద్యాల: దేశంలోనే చాలా కాస్ట్లీ గురూ...

  • దేశంలోనే నంద్యాల ఉపఎన్నిక చాలా కాస్ట్లీ ఎన్నికగా రికార్డు నమోదు చేసిందా?
  • నియోజకవర్గంలోని నేతల అంచనాలను చూస్తే నిజమే అనిపిస్తోంది.
  • తమిళనాడులోని ఆర్కె నగర్ కు ఆ ఘనత తృటిలో తప్పిపోయింది.
  • ఆ ఘనత నంద్యాలకు దక్కటంలో రాజకీయ పార్టీల తర్వాత ఎన్నికల కమీషన్ (ఈసీ)దే ప్రధాన పాత్రగా చెప్పుకోవాలి.
  • ఎందుకంటే, పేరు గొప్ప ఈసీని ఏ రాజకీయ పార్టీ  కూడా లెక్క చేయటం లేదు.
Is nandyala by poll records as costliest election in the country

దేశంలోనే నంద్యాల ఉపఎన్నిక చాలా కాస్ట్లీ ఎన్నికగా రికార్డు నమోదు చేసిందా? నియోజకవర్గంలోని నేతల అంచనాలను చూస్తే నిజమే అనిపిస్తోంది. తమిళనాడులోని ఆర్కె నగర్ కు ఆ ఘనత తృటిలో తప్పిపోయింది. ఆ ఘనత నంద్యాలకు దక్కటంలో రాజకీయ పార్టీల తర్వాత ఎన్నికల కమీషన్ (ఈసీ)దే ప్రధాన పాత్రగా చెప్పుకోవాలి. ఎందుకంటే, పేరు గొప్ప ఈసీని ఏ రాజకీయ పార్టీ  కూడా లెక్క చేయటం లేదు.

రాజకీయ పార్టీలున్నవే నిబంధనలను ఉల్లంఘించటానికి. ఈసీ ఉన్నది మాత్రం ఉల్లంఘనులకు ముకుతాడు వేయటానికే. కానీ రాజకీయ పార్టీలు తమ పాత్రను సమర్ధవంతంగా పోషిస్తుండగా, ఈసీ మాత్రం తన విధుల్లో పూర్తిగా విఫలమైంది. అందుకే నంద్యాల రికార్డు సృష్టించిందంటూ ప్రచారం జరుగుతోంది.

నంద్యాలలో టిడిపి, వైసీపీలు కలిపి సుమారుగా రూ. 160 కోట్లకు పైగానే వ్యయం చేసాయట. ఎందుకంటే, ఖర్చుల విషయంలో రెండు ప్రధాన పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. సరే, రెండు పార్టీలూ ఖర్చులు చేస్తున్నాయనే అనుకుందాం. కాకపోతే చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని టిడిపి కాబట్టి ఖచ్చితంగా వైసీపీ కన్నా ఎక్కువే వ్యయం చేసుంటుందనటంలో సందేహం అవసరం లేదు.

పరిమితికి మించి రాజకీయ పార్టీలు డబ్బులు ఖర్చు చేస్తున్నాయన్న విషయం ఎన్నికల కమీషన్ (ఈసీ) తో పాటు అందరికీ తెలుసు. కానీ ఈ సీ తరపున ఎవరైనా అభ్యర్ధులను, పార్టీలను నిలదీసారా?

వేల రూపాయలు పంచుతూ టిడిపి నేతలు కెమెరాలకు చిక్కినా ఒక్కరిపైన కూడా చర్యలు లేవంటేనే ఈ సి ఎంత బాగా పనిచేస్తోందో అర్ధమైపోతోంది. అధికార టిడిపి నేతలు చెప్పినట్లుగానే పోలీసులు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. కాబట్టే వైసీపీ నేతల ఇళ్ళపై మాత్రమే దాడులు జరుగుతున్నాయ్.

నంద్యాలలోని ఓ హోటల్లో మంత్రులు బస చేసి కోట్లరూపాయలు పంపిణీ చేస్తున్నారని వైసీపీ నేతల ఆరోపణలు చేస్తున్నా ఈసీ గానీ పోలీసులు కానీ పట్టించుకోవటం లేదు. వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని టిడిపి నేతలు దాడులు చేస్తున్న పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవటం లేదు.

సామాజికవర్గాల వారీగా టిడిపి నేతలు పలువురిని ప్రలోభాలకు గురిచేస్తున్నా ఈ సీ ఏం చేయలేకపోయింది. ప్రచారంలో భాగంగా నందమూరి బాలకృష్ణ డబ్బులు పంపిణీ చేసినా ఎటువంటి చర్యలూ లేవు. మొత్తానికి ఈ సీ అన్నది కోరలు లేని పాములా తయారైపోయింది.

అందుకే ఎవ్వరూ భయపడటం కాదు కదా కనీసం భయపడుతున్నట్లు నటించటం కూడా లేదు. అందుకే నంద్యాల ఉపఎన్నిక దేశంలోనే చాలా కాస్ట్లీ అయిపోయింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios