Asianet News TeluguAsianet News Telugu

అవిశ్వాస తీర్మానానికి గండి: ఎంత దారుణం

  • కేంద్రప్రభుత్వం నుండి టిడిపి తప్పుకున్నదే కానీ ఎన్డీఏలో నుండి మాత్రం కాదు.
Is naidu keep tdp aloof from no motion confidence moved by ycp this 21st

కేంద్రప్రభుత్వంపై ఈనెల 21వ తేదీన వైసిపి ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి గండికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదికూడా స్వయంగా చంద్రబాబునాయుడు పక్షం నుండే కావటం గమనార్హం. ఎలాగంటే, కేంద్ర మంత్రివర్గం నుండి టిడిపికి చెందిన ఇద్దరు ఎంపిలు తప్పుకున్న విషయం తెలిసిందే.

అయితే, కేంద్రప్రభుత్వం నుండి టిడిపి తప్పుకున్నదే కానీ ఎన్డీఏలో నుండి మాత్రం కాదు. అంటే, ఎన్డీఏలో ఉన్నంత కాలం కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి ఒక్క నిర్ణయం కూడా తీసుకునే అవకాశం లేదన్నది వాస్తవం. తాము ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వమంటూ వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎంత అడుగుతున్నా చంద్రబాబు కానీ టిడిపి కానీ ఏమాత్రం స్పందించటం లేదు.

కేంద్రమంత్రివర్గంలో నుండి తప్పుకుంటున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు ఎన్డీఏలో నుండి తప్పుకునే విషయాన్ని మాత్రం కన్వీనియంట్ గా పక్కన పెడుతున్నారు. ఎన్డీఏలో నుండి పక్కకు తప్పుకోనపుడు మంత్రివర్గంలో ఉంటే ఏమి? రాజీనామాలు చేస్తే మాత్రం ఏంటి? కేంద్రానికి మద్దతైతే కంటిన్యూ అవుతుంది కదా? ఇక కేంద్రానికి వ్యతరేకంగా టిడిపి తీసుకున్న నిర్ణయం ఏముంది?

అంటే, వైసిపి ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు విజయవంతంగా గండికొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే అవిశ్వాస తీర్మానం గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఎన్డీఏలో ఉంటూ అవిశ్వాస తీర్మానానికి ఎలా మద్దతు ఇస్తామని టిడిపి చెప్పుంటుంది. ఈ విషయాన్ని జగన్ కూడా పసిగట్టినట్లున్నారు.

అందుకే టిడిపియేతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు వ్యూహం పన్నుతున్నారు. మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాగూ కాంగ్రెస్ మద్దతు ఇచ్చేలాగే ఉంది. ఓ పదిమంది ఎంపిల మద్దతు గనుక జగన్ సంపాదించగలిగితే వైసిపి, కాంగ్రెస్ ఎంపిలతో కలిపి అవిశ్వాస తీర్మానానికి అవసరమైన బలం సరిపోతుంది. అపుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

 

Follow Us:
Download App:
  • android
  • ios