Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు ప్రధానమంత్రి షాక్?

మంత్రులు ప్రధానిని తప్పుపడుతూ మాట్లాడిన పేపర్ కట్టింగులను, వీడియో క్లిప్పింగులను స్ధానిక భాజపా నేతలు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు పంపేసారట. దాంతో భాజపా జాతీయ నాయకత్వం ఎప్పుడే విధంగా స్పందిస్తుందో అర్ధం కాక టిడిపిలో టెన్షన్ మొదలైంది.

Is modi moving away from naidu

చంద్రబాబునాయుడును ప్రధానమంత్రి దూరంగా పెడుతున్నారా? ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. కారణాలు స్పష్టంగా తెలీటం లేదుకానీ చంద్రబాబును విడిగా కలవటానికి ప్రధాని ఇష్టపడటం లేదని సమాచారం. చంద్రబాబు మొన్న 4వ తేదీన అమెరికా వెళ్ళిన విషయం తెలిసిందే కదా? అదే సందర్భంగా ప్రధాని అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు బాగా ప్రయత్నించారట. రెండు రోజుల ముందునుండి ఓ కేంద్రమంత్రి ప్రధాని అపాయింట్మెంట్ కోసం బాగా ప్రయత్నించారట. కానీ సాధ్యం కాలేదు.

దాంతో నిరాసతోనే చంద్రబాబు అమెరికా వెళ్ళిపోయారు. అయితే చంద్రబాబు అమెరికాలో ఉన్న సమయంలోనే మోడి జగన్ కు అపాయింట్మెంట్ ఇచ్చి ఢిల్లీకి పిలిపించుకున్నారు.  అంతా ఇంతా కాదు ఏకంగా గంటపాటు మాట్లాడారు. ఇంత వరకూ ఏ రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతతో కూడా ప్రధాని అంతసేపు మాట్లాడింది లేదు. ఆమాట కొస్తే పలువురు ముఖ్యమంత్రులతో అసలింత వరకూ భేటీనే కాలేదు. అటువంటిది జగన్ తో గంటపాటు సమావేశమవటమన్నది పెద్ద సంచలనమైంది. ఎందుకంటే, గడచిన ఏడాదిగా ప్రధాని చంద్రబాబుతో ఏకాంతంగా కలవలేదట.

ఇక్కడే, టిడిపికి బాగా మండింది. ఒకవైపు తమ అధినేత అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా స్పందించని మోడి, చంద్రబాబుకు పక్కలో బల్లెంలా తయారైన జగన్ తో గంటసేపు మాట్లాడారని తెలియగానే చాలామందికి నిద్ర పట్టలేదు, తిన్నది సయించలేదు. దాంతో ఆ అక్కసంతా జగన్-ప్రధాని భేటీపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడి తీర్చుకున్నారు. అయితే, తమ తొందరలో మోడిని కూడా తప్పుపట్టడంతో భారతీయ జనతా పార్టీ నేతలకు మండింది. దాంతో వారు టిడిపిని గట్టిగా అంటుకున్నారు.

ఇంతలో చంద్రబాబు అమెరికా నుండి తిరిగి రావటంతో పరిస్ధితి అర్ధం చేసుకున్నారు. మోడి గురించి మాట్లాడవద్దని తమ నేతలను కట్టడి చేసారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంత్రులు ప్రధానిని తప్పుపడుతూ మాట్లాడిన పేపర్ కట్టింగులను, వీడియో క్లిప్పింగులను స్ధానిక భాజపా నేతలు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు పంపేసారట. దాంతో భాజపా జాతీయ నాయకత్వం ఎప్పుడే విధంగా స్పందిస్తుందో అర్ధం కాక టిడిపిలో టెన్షన్ మొదలైంది.

Follow Us:
Download App:
  • android
  • ios