Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్ న్యూస్: రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి

  • మెజారిటీ నేతలు చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తినట్లు తెలిసింది.
Is minister manikyala rao prepared to resign

బిజెపిలోని చంద్రబాబునాయుడుకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వాడివేడి చర్చలు జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రప్రభుత్వం, టిడిపి అనుసరిస్తున్న వైఖరిపై చర్చించేందుకు ఆదివారం ఉదయం మొదలైన బిజెపి నేతల కీలక సమావేశం ముగిసింది. ఆ సమావేశంలో చంద్రబాబుకు అనుకూలంగాను, వ్యతిరేకంగాను చర్చలు జరిగినట్లు సమాచారం. మెజారిటీ నేతలు చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తినట్లు తెలిసింది.

ఈ సమావేశంలో పలు విషయాలపై నేతలు నిశితంగా చర్చించారు. మెజార్టీ నేతలు టీడీపీపై దూకుడుగా వెళ్లాల్సిందేనని గట్టిగా వాదించారు. బీజేపీ, ప్రధాని మోడీ, అమిత్ షాలపై విమర్శలను సహించలేకపోతున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు వద్ద పలువురు నేతలు తమ వేదనను వెలిబుచ్చారు. అయితే, ఆ విషయాన్నినెమ్మదిగా ఆలోచిద్దామని, తొందరపడ వద్దని నేతలకు హరిబాబు సూచించినట్లు సమాచారం.

అయితే, మంత్రి మాణిక్యాలరావు, ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు జోక్యం చేసుకుంటూ ఇప్పటికే బీజేపీకి చాలా డ్యామేజైందని  ఇక ఓపిక పట్టలేమని ఎంపీ హరిబాబుతో వాదనకు దిగినట్లు సమాచారం. అదే సమయంలో బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి  జోక్యం చేసుకుని మంత్రులిద్దరూ వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. దాంతో సమావేశంలో ఒక్కసారిగా వేడి పెరిగిపోయింది.

రెడ్డి డిమాండ్ చేయగానే మంత్రి మాణిక్యాలరావు కూడా వెంటనే రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దాంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. రాజీనామా విషయంపైనే సుమారు అరగంటపాటు సమాశంలో బాగా వాడిగా వేడిగా చర్చ జరిగినట్లు సమాచారం. మొత్తానికి పరిస్ధితిని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళాలని నిర్ణయించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios