వచ్చే  ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేయటానికి చాలామంది వారసులు రెడీ అయిపోతున్నారు. అనంతపురం, ఉభయగోదావరి, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు చెందిన సీనీయర్ నేతల పిల్లల పేర్లు బాగా వినబడుతున్నాయి. అటువంటి వారసుల పేర్లలో తాజాగా వినిపిస్తున్న మరో పేరు డాక్టర్ విజయలక్ష్మి. విజయలక్ష్మి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కూతురు. కోడెల గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరకీ తెలిసిందే.

జిల్లాలోని నరసరావుపేటకు చెందిన సీనియర్ నేత అయినప్పటికీ పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కోడెలను సత్తెనపల్లి నుండి పోటీ చేయించారు. అయితే ఏదో అదృష్ణం కొద్దీ గెలిచారు. తర్వాత స్పీకర్ కూడా అయ్యారు. స్పీకర్ అయిన దగ్గర నుండి క్రియాశీల రాజకీయాల్లో కోడెల కొడుకు శివరామకృష్ణ బాగా యాక్టివ్ అయ్యారు. దాంతో ప్రతీరోజు వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అవినీతి, బెదిరింపులు, కిడ్నాపులు ఇలా అనేక ఆరోపణలున్నాయి కొడుకు మీద.

పార్టీ నేతలే శివరామకృష్ణ దూకుడును భరించలేక చంద్రబాబు దగ్గర మొత్తుకున్న ఘటనలున్నాయ్. దాంతో దాని ప్రభావం కోడెలపైన పడుతోంది. ఎంతైనా కొడుకు కదా అందుకే స్పీకర్ కొడుకునే వెనకేసుకొస్తున్నారు ఒకవైపు ఆరోపణలు పెరిగపోతున్నాయి. ఇంకోవైను 2019 ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నాయి. దాంతో కోడెల కూతురు డాక్టర్ వజయలక్ష్మిని రంగం మీదకు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో కూతురుకు టిక్కెట్టు ఇప్పించుకునే విధంగా స్పకర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. కొడుకును ఎన్నికల్లో దింపితే గెలుపు అనుమానమే. అందుకనే కోడెల వ్యూహాత్మకంగా కూతురును రాజకీయాల్లోకి తేవాలని అనుకుంటున్నారట. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కూతురు పైన కూడా అవినీతి ఆరోపణలున్నాయి.  

అయితే ఇప్పుడు కోడెల బాటలోనే ఆయన కూతురు కూడా నడవనున్నారని..రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగిడనున్నారని తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో కోడెల నరసరావు పేట నుంచీ పోటీ చేసి తన కూతురు విజయలక్ష్మిని సత్తెనపల్లి నుంచీ పోటీ చేయించాలని భావిస్తున్నారట. అయితే, వచ్చే ఎన్నికల్లో కోడెల పోటీ చేసేది లేనిదీ తెలీదు. తన స్ధానంలో కూతురును ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకుంటున్నారా? లేకపోతే నరసరావుపేట, సత్తెనపల్లిలో ఇద్దరూ పోటీ చేయాలని అనుకుంటున్నారా అన్నదే తేలటం లేదు, ఏదేమైనా ఇద్దరికీ చంద్రబాబు టిక్కెట్లు ఇస్తారా అన్నది కూడా సస్పెన్సే.