ఈనెలాఖరున వైసీపీ నేతల కీలక సమావేశం జరుగబోతోందట. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పికె) కీలకమైన ప్రజంటేషన్  ఇవ్వనున్నారని సమాచారం. నవంబర్ 2వ తేదీ నుండి జగన్ మహా పాదయాత్ర మొదలవుతోంది కదా? అందుకనే పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు ముఖ్య నేతలు కూడా సమావేశంలో పాల్గొనాలని ఇప్పటికే వర్తమానం పంపారట.

ఇంతకీ సమావేశం ఎందుకంటే, రాష్ట్రంలో వైసీపీ పరిస్ధితిపై తాను చేయించిన సర్వే నివేదికలను ప్రశాంత్ కిషోర్ వివరిస్తారట. ప్రశాంత్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకూ మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ సర్వేలు చేయించారు. ప్రధానంగా వైసీపీ బలాలు, బలహనీతలతో పాటు టిడిపి ఎంఎల్ఏలు, నియోజకవర్గ ఇన్చార్జిలపైన కూడా ప్రధాన దృష్టి పెట్టారు. ఈ విధంగా ఇప్పటికి రెండు సార్లు సర్వే చేయించారట. ఆ నివేదికలను ఎప్పటికప్పుడు జగన్ ముందుంచుతున్నారు.

నవంబర్ 2వ తేదీ నుండి ప్రారంభమవుతున్న జగన్ పాదయాత్రకు ముందుగా హోలుమొత్తం మీద పార్టీ పరిస్ధితిపై ఓ ప్రజంటేషన్ ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రశాంత్ చెప్పగా జగన్ అందుకు అంగీకరించారట. అంటే, పాదయాత్ర మొదలు పెట్టేటప్పటికే 175 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిపై జగన్ కు పూర్తిస్ధాయి సమాచారం ఉంటుందన్నమాట. నివేదిక, సమావేశం ఆధారంగానే పరిస్ధితులను సర్దుబాటు చేసుకోవాలని జగన్ అనుకుంటున్నారు.

ఒకసారంటూ పాదయాత్ర మొదలైతే మళ్ళీ ఆరు మాసాల వరకూ నేతలందరితో సమావేశం అవ్వటం జగన్ కు కూడా సాధ్యం కాదు. అందుకనే జగన్ కూడా సమావేశం నిర్వహించటానికి అంగీకరించారు. పికె నివేదికల్లో ఏ ముంటుందోనని అప్పుడే వైసీపీ నేతల్లో ఉత్సుకత, ఆందోళన రెండూ మొదలయ్యాయట.