రాజకీయాల్లోకి జెడి: బిజెపినా ? జనసేనలోకా ?

రాజకీయాల్లోకి జెడి: బిజెపినా ? జనసేనలోకా ?

స్వచ్చంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్న ‘జెడి’ లక్ష్మీనారాయణ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా? అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఉద్దేశ్యంతోనే లక్ష్మీనారాయణ ఐపిఎస్ అధికారిగా విఆర్ఎస్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. జెడితో బిజెపి, జనసేన పార్టీలు టచ్ లో ఉన్నట్లు కూడా సమాచారం. కర్నూలు జిల్లా శ్రీశైలంకు చెందిన 1980 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులతో వివాదాస్సద అధికారిగా పాపులర్ అయ్యారు.

జెడి రాజకీయ ఎంట్రీ గురించి చాలా కాలంగా ప్రచారంలో ఉన్నప్పటికీ సూటిగా ఆయనెపుడూ స్పందించలేదు. కాకపోతే ఇపుడు విఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న నేపధ్యంలో రాజకీయ ప్రవేశం గురించి మళ్ళీ ఊహాగానాలు ఊపందుకుంది.

ఇంతకీ జరుగుతున్న ప్రచారం ఏంటంటే, జెడి త్వరలో జనసేనలోకి గానీ బిజెపిలో కానీ చేరుతారట. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందన్న ఉదేశ్యంతో జెడిని పార్టీలోకి చేర్చుకోవటానికి బిజెపి, జనసేనలు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా జెడి బిసి సామాజికవర్గానికి చెందిన అధికారి కావటం గమనార్హం.

యూత్ లోను మధ్య తరగతి కుటుంబాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న జెడిని తమ పార్టీలోకి చేర్చుకుంటే రేపటి ఎన్నికల్లో ఉపయోగం ఉంటుందని పై రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. జెడి రాజకీయ ప్రవేశంపై టిడిపి ఎంఎల్సీ పయ్యావు కేశవ్ మాట్లాడుతూ, గతంలో జయప్రకాశ్ వల్ల ప్రతిపక్షంలో ఉన్న తమకు నష్టం జరిగిందన్నారు. ఇపుడు జెడి రాజకీయాల్లోకి అడుగుపెడితే ప్రతిపక్షాలకే నష్టమన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos