గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దపడుతున్నాయి. బహుశా డిసెంబర్ లో గానీ లేదా వచ్చే జనవరినెలలో గానీ ఎన్నికలు జరిగే అవకాశముందని టిడిపిలో ప్రచారం జరుగుతోంది. అందుకనే చంద్రబాబునాయుడు కూడా విశాఖపట్నంపైనే ప్రధాన దృష్టి పెట్టారు.
గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దపడుతున్నాయి. బహుశా డిసెంబర్ లో గానీ లేదా వచ్చే జనవరినెలలో గానీ ఎన్నికలు జరిగే అవకాశముందని టిడిపిలో ప్రచారం జరుగుతోంది. అందుకనే చంద్రబాబునాయుడు కూడా విశాఖపట్నంపైనే ప్రధాన దృష్టి పెట్టారు. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా విశాఖ కార్పొరేషన్ ఎన్నికలో గెలవాలన్న పట్టుదలతో ఇప్పటి నుండి అక్కడ డివిజన్ల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గడచిన ఐదేళ్లుగా కార్పొరేషన్ కు పాలకమండలి లేనందున అధికారుల పాలనలో ఉంది. విశాఖలో గెలవటానికి ఇటు టిడిపికైనా అటు వైసీపీకైనా సమానంగా అవకాశాలున్నాయి. కాకపోతే అధికారంలో ఉండటమన్నది టిడిపికి బాగా కలసివచ్చే అంశం. ఈ విషయం నంద్యాల ఉపఎన్నికతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలో స్పష్టంగా బయటపడింది.
