జగన్ రైతు అజెండాను చంద్రబాబు కూడా ఫాలో కావాలనుకుంటున్నారా? కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధును, జగన్ నవరత్నాల్లో ప్రకటించిన రైతు పథకాలను అనుసరిస్తూనే ఓ సరికొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? ఇది అమలైతే కౌలు, సన్నకారు, చిన్నకారు రైతులకు కూడా నెలకు కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ అందనుందా? ఇలాంటి ప్రశ్నలకు దాదాపు సమాధానం దొరికే సమయం వచ్చింది. 

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించేందుకు అవసరమైన అస్త్రాలను ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటున్న చంద్రబాబు సర్కారు... ఈ దిశగా జగన్ నవరత్నాలకు రాష్ట్ర ప్రజల్లో వస్తున్న స్పందన పట్ల చంద్రబాబు ఒక కన్నేసి ఆ పథకాలను ఫాలో అయ్యే పనిలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెర‌పైకి తెచ్చిన న‌వ‌ర‌త్నాలను.. ఎన్నిక‌ల వ‌స్తున్న‌ వేళ చంద్ర‌బాబు వాటిని కాపీ కొట్టి పేర్లు మార్చి కొన్ని ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఆస‌రా ఫించ‌న్లు 2వేలు చేసిన బాబు, ఇప్ప‌డు తాజాగా రైతుల వ్య‌వ‌సాయం కోసం ఇస్తున్న 7గంట‌ల ఉచిత క‌రెంట్‌ను 9గంట‌లు ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. అలాగే జ‌గ‌న్ ప్ర‌కటించిన న‌వ‌రత్నాల‌లో ముఖ్య‌మైన హామీల‌ను కూడా చంద్ర‌బాబు ట‌చ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

గత నాలుగున్నరేళ్లుగా ఏమి చేయకుండా ఇప్పుడు హడావుడిగా ఎన్నికల సమయంలో జగన్ ప్రకటించిన కొన్ని పథకాలను చంద్రబాబు కాపీ చేయటం బాబు 40 ఏళ్ళ అనుభవానికి తగాదేమో. ఏది ఏమైనా చంద్రబాబు 2014 అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్ఆర్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చిన కాపీ ఘనత ఖచ్చితంగా చంద్రబాబుకే దక్కుతుందనటంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

 

                                                                                                                             జయరామ్. పి