వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పూర్తితోనే ఓ సినిమా రాబోతోందా? జగన్ అభిమానులు అవుననే అంటున్నారు. ప్రిన్ప్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘భరత్ నేను’ అనే సినిమాకు స్పూర్తే జగన్ అని వైసిపి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అంతేకాకుండా సినిమాకు సంబంధించిన నిముషం ట్రైలర్ ను సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేస్తున్నారు.

ఇంతకీ జగన్-భరత్ అను నేను సినిమాకు ఉన్న లింక్ ఏంటి? కొరటాల శివ దర్శకత్వం వహించిన కొత్త సినిమాకు జగన్ ఎలా స్పూర్తిగా నిలిచారు? ప్రస్తుతం ఈ ప్రశ్నే అందరి బుర్రలను తొలిచేస్తోంది.

పై ప్రశ్నకు జగన్ అభిమానులు చెప్పే సమాధానం ఏంటంటే, భరత్ అనే నేను సినిమా స్టోరి లైన్ కొరటాల శివకు వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూసినాకే అని అంటున్నారు. ఎందుకంటే టీజర్ లో ఉన్న ప్రతి డైలాగు కొంచెం అటు ఇటుగా జగన్ నోటి నుంచి వచ్చినవేనట.

జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నల్ల కాలువలో ఇచ్చిన మాట కోసం ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చారో, ఆయన స్టైల్, ఇప్పటివరకు ప్రజలతో మమేకం అవుతున్న తీరు ఇలా..ప్రతి ఒక్క అంశమూ కొత్త సినిమా టీజర్ లో కనిపిస్తోందన అభిమానులంటున్నారు. టీజర్ చూసినంత సేపు ప్రతి ఒక్కళ్ళకు జగన్ డైలాగులే గుర్తుకొస్తున్నాయట. అందుకనే కొరటాల కొత్త సినిమాకు జగనే స్పూర్తంటూ జగన్ అభిమానులు సంబరపడిపోతున్నారు.