Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లకు సెలవులు పొడగిస్తారా?.. రేపటితో ముగియనున్న సెలవులు..

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ సర్కార్.. విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులను పొడగించింది. ఇప్పటికే ఏపీలో కరోనా కట్టడి ఆంక్షల అమలు చేస్తున్న ప్రభుత్వం.. స్కూల్స్, కాలేజ్‌లకు సెలవులు పొడగించనుందని తెలుస్తోంది. 
 

is Andhra pradesh government extend holidays for schools and colleges
Author
Vijayawada, First Published Jan 16, 2022, 2:48 PM IST

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేయనుంది. అంతేకాకుండా.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌, మాల్స్ నిర్వహించాలని తెలిపింది. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. 

దేవాలయాలు, ప్రార్థనామందిరాల్లో భౌతికదూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని సీఎం జగన్ అన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించాలన్నారు. బస్సుల్లో ప్రయాణికులు మాస్కు ధరించేలా చూడాలన్నారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి మించకూడదని..  ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదని సీఎం జగన్ ఆదేశించారు.

అయితే తెలంగాణలో కరోనా ఎఫెక్ట్‌‌తో విద్యాసంస్థలకు సెలవులను ఈ నెల 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా విద్యాసంస్థలకు సెలవులను పొడగిస్తారా..? లేదా..? అనే చర్చ సాగుతుంది. ఏపీలో స్కూల్స్, కాలేజ్‌లకు ఈ నెల 17తో సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలావరకు పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయని వైద్యులు చెపుతున్నారు. దీంతో విద్యాసంస్థలకు సెలవులు పొడగించే అంశంపై ప్రభుత్వం అధికారులతో చర్చలు జరుపుగుతుంది. 

రానున్న రెండు వారాలు దేశంలో కరోనా కేసులు భారీగా పెరగే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో.. ముఖ్యంగా పాఠశాలలను ఈ నెల 18 నుంచి ప్రారంభించాలా..?, లేక ఇంకొన్ని రోజులు సెలవులను పొడగించాలా..? అనే అంశంపై  విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే రేపటితో సంక్రాంతి సెలవులు ముగియనుండటంతో ఇందుకు సంబంధించి రేపు ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక, ఏపీలో గత 24 గంటల్లో ఏకంగా 4,955 కరోనా కేసలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,01,710కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో విశాఖ, చిత్తూరు జిల్లాల్లో అధికంగా ఉన్నాయి. విశాఖ జిల్లాలో 1,103 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,039 కేసులు నమోదైనట్టుగా ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా కరోనాతో ఒకరు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 14,509కి చేరింది. తాజాగా రాష్ట్రంలో కరోనా నుంచి 397 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 20,64,331కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,870కి పెరిగింది. ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు 13.87 శాతం నమోదవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios