నంద్యాలలో భూమాబ్రహ్మానందరెడ్డి పోటీ చేయటం భూమాఅఖిలప్రియ కుటుంబానికి ఇష్టం లేదా? తన తండ్రి మృతి వల్ల అనివార్యమైన ఉపఎన్నికలో తన చెల్లెలు మౌనిక పోటీ చేయాలని అనుకున్నట్లు చెప్పటం సంచలనం రేపుతోంది. నంద్యాలలో తన చెల్లెలే పోటీ చేయాలని ప్రయత్నించిన మాట వాస్తవమేనన్నారు.
నంద్యాలలో భూమాబ్రహ్మానందరెడ్డి పోటీ చేయటం భూమాఅఖిలప్రియ కుటుంబానికి ఇష్టం లేదా? మంత్రి అఖిలప్రియ తాజా ఇంటర్వ్యూ చూసిన వారు అలానే అనుకుంటున్నారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల మాట్లాడుతూ, తన తండ్రి మృతి వల్ల అనివార్యమైన ఉపఎన్నికలో తన చెల్లెలు మౌనిక పోటీ చేయాలని అనుకున్నట్లు చెప్పటం సంచలనం రేపుతోంది. బ్రహ్మానందరెడ్డి టిడిపి అభ్యర్ధిగా నెలరోజులకు పైగా ప్రచారం చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబునాయుడు ప్రచారం కూడా చేసారు.
దానికితోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇటువంటి పరిస్ధితిల్లో అఖిల తన చెల్లెలు గురించి ఎందుకు ప్రస్తావన తెచ్చిందో అర్ధం కావటం లేదు. పైగా ఉపఎన్నికలో టిడిపి గెలిచినా, ఓడినా ఒకటే అన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకాలం నంద్యాలలో టిడిపినే ఖచ్చితంగా గెలుస్తుందంటూ ఢంకా భజాయించి చెప్పిన అఖిల తాజాగా చేసిన వ్యాఖ్యలపై పార్టీ నేతలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
నంద్యాలలో తన చెల్లెలే పోటీ చేయాలని ప్రయత్నించిన మాట వాస్తవమేనన్నారు. సరే, అందులో తప్పుకూడా లేదు. తన తండ్రి ఖాళీ చేసిన నియోజకవర్గం కాబట్టి వారసురాలిగా పోటీ చేయాలని మౌనిక అనుకోవటం సబబే. అయితే అక్కడితో ఆగకుండా ఇప్పటికీ తన చెల్లెలుకు ఇక్కడి నుండ పోటీ చేయాలనుందని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు. అంటే తప్పని పరిస్ధితిల్లో మాత్రమే బ్రహ్మానందరెడ్డికి అఖిల మద్దతు తెలిపినట్లు అర్ధమవుతోంది. ఎన్నికల తేదీ కూడా వచ్చేసిన సమయంలో అఖిల ఇలా ఎందుకు మాట్లాడిందో ఎవరికీ అర్ధం కావటం లేదు.
