ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత టీడీపీ హయాంలో ఏపీ ఆర్ధిక అభివృద్ది మండలి సీఈవోగా పనిచేసిన కిశోర్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.

Also Read:జగన్‌కు భారీ షాకిచ్చే యోచనలో బిజెపి... విజయవాడకు సీబీఐ

ఈ క్రమంలో పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం కృష్ణకిశోర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా సీఐడీ, ఏసీబీ డీజీలకు ఆదేశాలకు జారీ చేసింది.

Also Read:షోకాజ్ నోటీస్: పవన్ కల్యాణ్ మీద ఎమ్మెల్యే రాపాక తిరుగుబాటు

కృష్ణకిశోర్ ఈడీబీ సీఈవోగా పనిచేసిన సమయంలో జరిగిన అక్రమాలపై ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు అమరావతిని విడిచి వెళ్లరాదని ప్రభుత్వం కృష్ణకిశోర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.