అనంతపురం: తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనంతపురం జిల్లా. అలాంటి జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఆ పార్టీని గందరగోళంలో నెట్టేస్తోంది. ఇక అనంతపురం రాజకీయాల్లో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య విభేదాలు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 

ఒకేపార్టీలో ఉన్న వీరిద్దరూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటుంటారు. ఎంపీ, ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలకు దిగుతారు. దీంతో రంగంలోకి దిగిన టీడీపీ అధిష్టానం బుజ్జగింపులకు దిగడంతో కొంతకాలంగా ఇద్దరూ స్తబ్ధుగా ఉన్నారు. అయితే తాజాగా ఆదివారం జేసీపై ప్రభాకర్ చౌదరి సంచలన వ్యాక్యలు చేశారు. 

అక్రమంగా ఇల్లు, ఇంటి స్థలాలు సంపాదిస్తుంది ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డేనని విమర్శలు గుప్పించారు. ఆదివారం లలిత కళాపరిషత్‌లో జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీసీల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతుంది కేవలం తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. 

అలాగే అక్రమంగా ఇల్లు, ఇంటి స్థలాలు సంపాదిస్తుంది కూడా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డేనంటూ విమర్శలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న విభేధాలు మరోసారి బట్టబయలయ్యాయి.