కాలేజి హాస్టల్లో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

intermediate student commits suicide in vishakhapatnam
Highlights

విశాఖపట్నంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని మూడు రోజుల క్రితమే కాలేజీలో జాయినై ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ హాస్టల్ గదిలోనే బలవన్మరణానికి పాల్పడింది. విద్యార్థి ఆత్మహత్యతో విశాఖ లో తీవ్ర కలకలం రేగుతోంది.

వివరాల్లోకి వెళితే...విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి చెందిన మర్రి అమృత విశాఖపట్నం లోని గ్రావిటీ జూనియర్ కాలేజీలో జాయినైంది. మూడు రోజుల క్రితమై  ఈమె గ్రావిటీ మెడికల్ క్యాంపస్ లో ఐఐటీ, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోడానికి ప్రవఏశం పొందింది. అయితే ఏమైందో ఏమో గాని ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో కాలేజీ హాస్టల్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. తన గదిలో ప్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 

కూతురి ఆత్మహత్య విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  కూతురి ఆత్మహత్యపై వారు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు అమృత ఆత్మహత్యపై విచారణ జరపాలని పోలీసులకు కోరుతున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదఏహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇప్పటివరకు ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని,  ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   
 
loader